Viral metro video: వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:21 PM
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (woman metro incident).
memedox20 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మెట్రో రైలు డోర్ వద్ద ఓ యువతి నిలబడి ఉంది. స్టేషన్‌లో మెట్రో రైలు డోర్ ఓపెన్ అయిన తర్వాత వెనుక నుంచి ఓ మహిళ ఆ యువతిని తన్నింది. దీంతో ఆ యువతి ప్లాట్‌ఫామ్ పైకి వెళ్లి పడింది. ఆ తర్వాత ఆ యువతి పైకి లేచి నవ్వుకుంటూ మళ్లీ ట్రైన్ ఎక్కింది. కేవలం రీల్ కోసమే ఆ ఇద్దరూ ఈ స్టంట్ చేసినట్టు అర్థమవుతోంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (social media viral clip).
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 56 లక్షల మందికి పైగా వీక్షించారు (woman in metro viral). దాదాపు ఏడు వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఏదైనా తేడా వస్తే చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, రీల్స్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చాలా మంది కామెంట్లు చేశారు. ఇది జోక్ కాదని, తీవ్రమైన నిర్లక్ష్యం అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..
శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక