Telangana Cabinet: మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
ABN , Publish Date - Jan 18 , 2026 | 09:31 PM
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మేడారంలో ఆదివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు..
మేడారం, జనవరి18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మేడారంలో ఆదివారం కేబినెట్ సమావేశం (Telangana Cabinet) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మేడారంలో రెండున్నర గంటల పాటు మంత్రి మండలి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా 18 అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు.
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదించింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కేబినెట్‌లో చర్చించారు.
కేబినెట్‌లో చారిత్రక నిర్ణయాలు: మంత్రి సీతక్క

ఈ కేబినెట్ భేటీకి సంబంధించిన విషయాలను మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్ర కేబినెట్‌నే మేడారానికి తీసుకొచ్చామని తెలిపారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకురాబోతున్నామని వెల్లడించారు. సీఎంకు, ఈ గుడికి కుటుంబ బంధం లేదని, కుల బంధం లేదని.. ఇది భావోద్వేగ బంధమని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి.. చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. సమ్మక్క - సారలమ్మ ఘనకీర్తి తనకు దక్కడం సంతోషకరంగా ఉందని వ్యాఖ్యానించారు. కేబినెట్‌లో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. రూ.143 కోట్లతో ములుగుకు లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలను తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News