Cabinet Meet: మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:40 PM
తెలంగాణ కేబినెట్ సమావేశం మేడారంలో ప్రారంభం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.
మేడారం, జనవరి18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కేబినెట్ సమావేశం(Telangana Cabinet Meeting) మరికాసేపట్లో మేడారంలో ప్రారంభం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ప్రధానంగా మేడారం అభివృద్ధికి శాశ్వత ప్రణాళికల మాస్టర్ ప్లాన్‌పై మాట్లాడనున్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు, నిర్వహణ సహా జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుపై మాట్లాడనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు సీఎం. కృష్ణా, గోదావరి నదీజలాలు, ప్రాజెక్టులపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మేరకు హెలికాప్టర్ ద్వారా మేడారానికి చేరుకున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే మంత్రులు కూడా మేడారానికి వెళ్లారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీటీవీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల పనితీరును సీఎం, మంత్రులు పర్యవేక్షించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ముఖ్యమంత్రి. అక్కడి సీసీటీవీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీ పనితీరును పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. మేడారం మహాజాతర భద్రతా ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి, కూతురు నైమిషా, అల్లుడు, మనవడు రియాన్స్ ఇక్కడకు చేరుకున్నారు. అంతకుముందు.. ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్
For More TG News And Telugu News