Home » Medaram Jathara
మేడారం సమ్మక్క- సారక్క అమ్మవార్ల గద్దెల పున: నిర్మాణ పనుల్లో ఎక్కడ అవినీతి జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గద్దెల పున: నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని.. ఆధారాలు ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.
మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది. నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది పైచిలుకు భక్తులు మేడారం జాతరకు తరలి వచ్చారు. మహా జాతర వేళ భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుముల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. బుధవారం నుంచి నాలుగురోజులపాటు జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ప్రత్యేక పూజలతో సమ్మక్క-సారలమ్మలనే తిరిగి వన ప్రవేశం చేస్తారు.
ములుగు జిల్లా కన్నెపల్లి ఆలయంలో సారలమ్మ కాసేపట్లో మేడారం బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య కన్నెపల్లి పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వనదేవతల దర్శనానంతరం ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ తమ ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
మేడారం జాతర ప్రారంభం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మ దేవతలను ఆయన ప్రార్థించారు.
పూనుగొండ్ల నుంచి మేడారం దిశగా పగిడిద్దరాజు ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది. కోయ పూజారులు సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పగిడిద్దరాజును మేడారం తీసుకొస్తున్నారు. మేడారం జాతరకు ముందుగా జరిగే ఈ కార్యక్రమం గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర ప్రారంభం రోజైన బుధవారం భక్తులు పెద్దసంఖ్యలో ఉంటారనే భావనతో చాలామంది ముందస్తుగానే మేడారాని చేరుకుని తమతమ మొక్కులతను చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం భక్తజన గూడారంగా మారిపోయింది.
మేడారం మహాజాతర ఈనెల 28వతేదీ నుంచి ప్రారంభంకానుంది. 31వరకు జాతర జరగనుండగా... దాదాపు కోటిమందికిపైగా భక్తులు వచ్చేస్తారని అంచనా. అయితే.. జాతరకు విచ్చేసే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ర్యూట్ మ్యాప్‌ను రూపొందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో నేడు తొలి ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మండమెలిగే పండుగతో మొదలవుతున్న.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం.. లక్షలాది మంది భక్తుల రాకతో మరింత వైభవంగా కొనసాగనుంది.