నేడే తల్లుల వన ప్రవేశం
ABN , Publish Date - Jan 31 , 2026 | 10:29 AM
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. బుధవారం నుంచి నాలుగురోజులపాటు జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ప్రత్యేక పూజలతో సమ్మక్క-సారలమ్మలనే తిరిగి వన ప్రవేశం చేస్తారు.
- ముగియనున్న మహాజాతర
మేడారం: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో ఆఖరి ఘట్టం అయిన వనప్రవేశం శనివారం జరుగనున్నది. దీంతో నాలుగు రోజు ల పాటు వైభవంగా జరిగిన సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తెరపడనున్నది. శనివారం సాయంత్రం సుమారు 5గంటలకు సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్యతో పాటు మిగతా పూజారులు మల్యాల సత్యం, సిద్దబోయిన మునీందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన్ సమ్మక్క గద్దె వద్దకు చేరుకొని రహస్యంగా చివరి పూజలు చేస్తారు. ఈ పూజలు జరిపే సమయంలో భక్తుల దర్శనాలను కొంతసేపు నిలిపివేస్తారు.
సమ్మక్క గద్దెపైకి ఈ పూజారులు మాత్రమే వెళ్లి వనప్రవేశానికి సంబంధిం చిన ఆదివాసీ సంప్రదాయ తంతును ము గిస్తారు. ఆ తర్వాత తల్లి రూపమైన కుంకుమ భరిణను తీసుకొని బయలుదేరుతారు. చిలుకలగుట్టపైకి తీసుకువెళ్లి అక్కడ ఆమె నిజస్థానంలో ఉంచి వెనుదిరు గుతారు. మళ్లీ రెండేళ్లకు వస్తాం తల్లీ.. అంటూ సెలవు తీసుకుంటారు. అలాగే శనివారం రోజే సమ్మక్కతో పాటు సారలమ్మను, గోవిందరాజులును, పగిడిద్దరాజు కూడా వనప్రవేశం చేస్తారు. సారలమ్మను కన్నెపల్లి(Kannepalli)లోని ఆమె గుడికి, పగిడిద్దరాజును పూనుగుండ్లకు, గోవిందరాజులను కొండా యిలోని వారి నిజస్థానాల్లోకి తిరిగి చేరు స్తారు. అక్కడ పూజల అనంతరం వెనుదిరుగుతారు.
కాగా, శనివారం సాయంత్రం వనప్రవే శం జరిగే వరకు, ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల వరకు భక్తులు మొక్కు లను సమర్పించడం నిరంతరాయంగా కొనసాగుతుంది. శనివారం వనప్రవేశానికి ముందు మధ్యాహ్నం తర్వాత గద్దెలపై ఉన్న బెల్లం, బియ్యాన్ని తొలగించి గద్దెలను శుద్ధి చేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులను గద్ద్దెలపైకి తీసుకువచ్చే సమయంలో నిర్వహించిన పూజాతంతునే వనప్రవేశం సందర్భంగా కూడా తిరిగి నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ధరలు రికార్డు స్థాయిలో డౌన్! నేటి రేట్స్ ఇవీ
Read Latest Telangana News and National News