కన్నెపల్లి నుంచి మేడారం బయలుదేరనున్న సారలమ్మ
ABN , Publish Date - Jan 28 , 2026 | 07:05 PM
ములుగు జిల్లా కన్నెపల్లి ఆలయంలో సారలమ్మ కాసేపట్లో మేడారం బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత మధ్య కన్నెపల్లి పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ములుగు జిల్లా: మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. కన్నెపల్లిలో ఆదివాసి సంప్రదాయాల నడుమ మేడారం వైపు సారలమ్మ బయలుదేరనున్నారు. ఆలయంలో ఆదివాసి పూజారులు రహస్య పూజలు నిర్వహిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న గిరిజన ఆచారాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఈ పూజలు జరుగుతున్నాయి. సారలమ్మ బయలుదేరే ఘట్టాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో కన్నెపల్లికి తరలివస్తున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కూడా కన్నెపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో కోయ గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కూడా కోయ నృత్యంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తుల రద్దీ దృష్ట్యా కన్నెపల్లి సారలమ్మ గుడి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read:
భూపాలపల్లి జిల్లాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థుల మృతి
Read Latest Telangana News And Telugu News