మేడారం జాతర.. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
ABN , Publish Date - Jan 27 , 2026 | 07:35 PM
మేడారం జాతర ప్రారంభం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మ దేవతలను ఆయన ప్రార్థించారు.
హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమై, కోరిన కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమై కొనసాగుతుందన్నారు.
తెలంగాణ ఆదివాసీ గిరిజన సమాజాల సబ్బండ కులాల సంస్కృతి సాంప్రదాయాలకు పదేళ్ల బీఆర్ఎస్ పాలన పెద్దపీట వేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. గోదావరిలోయ పరివాహక ప్రగతితో సమాంతరంగా సాగిన ఆధ్యాత్మిక అభివృద్ధిని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. అన్ని రంగాల్లో ప్రగతి తిరిగి పుంజుకొని, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మ దేవతలను కేసీఆర్ ప్రార్థించారు.
Also Read:
ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు ఇక్కట్లు
టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!
For More Latest News