Share News

రాష్ట్ర ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

ABN , Publish Date - Jan 27 , 2026 | 08:46 PM

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వనదేవతల దర్శనానంతరం ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ తమ ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
CM Revanth Reddy Greeting

హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లేవారికి, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు అమ్మవార్ల దర్శనంతో కృపకు పాత్రులై, ఆధ్యాత్మిక శాంతిని పొందాలని సీఎం ఆకాంక్షించారు. దర్శనానంతరం ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ తమ ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. మేడారం జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని సీఎం తెలిపారు.


యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. జాతర ఏర్పాట్లపై ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాలు అత్యంత ప్రాధాన్యంగా ఉండాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.


Also Read:

ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. కస్టమర్లకు ఇక్కట్లు

టీ20 ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే.. తప్పవీ శిక్షలు!

For More Latest News

Updated Date - Jan 27 , 2026 | 09:12 PM