Vijayasai Reddy: కోటరీలో బందీలుగా ఉన్నారు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jan 18 , 2026 | 07:51 PM
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా (ఫేస్‌బుక్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్ముడు పోయి కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోవాలని హితవు పలికారు..
విశాఖపట్నం, జనవరి18 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijay SaiReddy) సోషల్ మీడియా (ఫేస్‌బుక్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్ముడుపోయి కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి.. అంటూ హితవు పలికారు. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించాలని పేర్కొన్నారు.
వారంతా అమ్ముడుపోవడమే..
వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి అన్నారు. దీనికి కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవటమే కదా’! అంటూ ట్వీట్ చేశారు.
గతంలో జగన్‌పై కామెంట్స్..
అయితే, గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని.. విజయ సాయి రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్‌ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడరం పర్యటన ముగించుకుని విదేశాలకు సీఎం..
మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
For More AP News And Telugu News