Modi Targets Trinamool: టీఎంసీపై ప్రధాని మోదీ ఫైర్.. జంగిల్ రాజ్‌కు వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపు..
ABN , Publish Date - Jan 18 , 2026 | 06:00 PM
ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ఆదివారం పర్యటించారు. పర్యటన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ఆదివారం పర్యటించారు. పర్యటన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. అతి త్వరలో పశ్చిమ బెంగాల్‌లో జంగిల్ రాజ్‌కు వీడ్కోలు చెబుతామని అన్నారు. రాష్ట్రంలో మార్పు తప్పనిసరిగా తీసుకురావాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా గేట్ ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకి మాత్రమే దక్కుతుందని అన్నారు.
మొదటి సారిగా ఆజాద్ హిందు ఫౌజ్‌కు ఎర్రకోట దగ్గర గౌరవం దక్కిందని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఓ దీవికి నేతాజీ పేరు కూడా పెట్టామని వెల్లడించారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. బెంగాలీ భాషకు క్లాసికల్ భాషగా గౌరవం దక్కిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కారణంగానే దుర్గా మాత పూజకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకుంటోందని చెప్పారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. తన మీద, బీజేపీ మీద ఉన్న కోపాన్ని బెంగాల్ ప్రజల మీద చూపిస్తోందని..వారు ఇబ్బందిపడేలా చేస్తోందని మండిపడ్డారు.
మత్స్యకారులకు సరైన విధంగా సాయం అందటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించటం లేదని, అందువల్లే మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వ పథకాల లాభాలు అందవని చెప్పారు. బెంగాల్ ప్రజలు క్రూరమైన టీఎమ్‌సీ ప్రభుత్వానికి ఓ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ .. ‘బెంగాల్‌లోని ప్రజల భవిష్యత్తు బాగుండాలా? లేదా? బెంగాల్ క్షేమంగా ఉండాలా? లేదా?’.. అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆంధ్రజ్యోతి బొగ్గు గనుల కథనంపై స్పందించిన సీఎం రేవంత్..
బాబర్‌తో ఎలాంటి విభేదాల్లేవు.. స్పష్టం చేసిన స్టీవ్ స్మిత్