Coal Scam: ఆంధ్రజ్యోతి బొగ్గు గనుల కథనంపై స్పందించిన సీఎం రేవంత్..
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:47 PM
ఆంధ్రజ్యోతి కొత్తపలుకులో ‘బొగ్గు కోసం నీచ కథనం’ అంటూ వచ్చిన వార్తపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేదని సీఎం అన్నారు.
ఖమ్మం, జనవరి 18: ఆంధ్రజ్యోతి కొత్తపలుకులో ‘బొగ్గు కోసం నీచ కథనం’ అంటూ వచ్చిన వార్తపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేదన్న సీఎం.. ఇలాంటి కథనాలు రాసేముందు తమ వివరణ తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆదివారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఇదే సమయంలో బొగ్గు గనుల అంశంపై స్పందించారు.
సీఎం ఏమన్నారంటే..
‘బొగ్గు కుంభకోణం అంటూ వార్తల్లో రాస్తున్నారు. మా ప్రభుత్వంలో ఎక్కడా అవినీతికి తావు లేదు. ఇద్దరు మీడియా యజమానులు కొట్టుకుని మా మీద బురద జల్లకండి. మీ రాతలతో మారీచుడు, సుబాహుడికి ఊతం ఇవ్వకండి. మీరు రాసేముందు మా వివరణ అడగండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ల సలహాలతో మా ప్రభుత్వం పని చేస్తోంది. సింగరేణి కోల్ మైనింగ్ టెండర్లను నిఖార్సయిన సీనియర్లకు మాత్రమే ఇస్తాము. ఎక్కడా అవినీతికి తావులేదు. గత ముఖ్యమంత్రి ఏకపాత్రాభినయం చేశారు. మేమందరం సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. కోల్ మైనింగ్ టెండర్‌లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Also Read:
బాబర్‌తో ఎలాంటి విభేదాల్లేవు.. స్పష్టం చేసిన స్టీవ్ స్మిత్
ఖాళీ పేస్ట్ ట్యూబ్‌ను పక్కన పడేస్తున్నారా.. ఈమె ఎలా వాడిందో చూస్తే..
యువకుడి గొప్ప మనసు.. ఆకలితో అల్లాడుతున్న వృద్ధుడిని..