Heartwarming Act Of Kindness: యువకుడి గొప్ప మనసు.. ఆకలితో అల్లాడుతున్న వృద్ధుడిని..
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:58 PM
రోడ్డుపై డబ్బులడిగిన ఓ యాచకుడికి భోజనం పెట్టించి అందరి మన్ననలూ పొందుతున్నాడో యువకుడు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకే ఓ యువకుడు ఆకలి బాధతో అల్లాడుతున్న ఓ వృద్ధుడి కడుపు నింపాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోము అనే యువకుడు కొన్ని నెలల క్రితమే సోషల్ మీడియాలో కంటెంట్ మేకింగ్ జర్నీ మొదలుపెట్టాడు. వ్లాగ్ వీడియోలు చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతడు రోడ్డు మీద స్కూటీపై వెళుతుండగా ఓ వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు తిండి తినడం కోసం జనాలను డబ్బులడుగుతూ ఉన్నాడు.
స్కూటీ దగ్గరకు రాగానే ఆ వృద్ధుడు డబ్బులు కావాలని సోమును అడిగాడు. సోము డబ్బులు ఇవ్వకుండా.. మంచి భోజనం పెట్టిస్తానని వృద్ధుడికి చెప్పాడు. ఆయన ఎంతో సంతోషించాడు. సోము ఆయన్ను రోడ్డు పక్కన భోజనం అమ్మే మహిళ షాపు దగ్గరకు తీసుకెళ్లాడు. మంచి భోజనం పెట్టించాడు. వృద్ధుడు భోంచేసి ఎంతో సంతోషించాడు. సోము దీన్నంతా వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వేలసంఖ్యలో లైక్స్.. లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంది.
110 మందికిపైగా వీడియోపై కామెంట్లు చేశారు. ‘ఆకలి చాలా భయంకరమైనది.. మనిషిని ఎంతకైనా దిగజారేలా చేస్తుంది. ఆ వృద్ధుడి కడుపునింపి చాలా మంచి పని చేశావు’.. ‘తినడానికి తిండిలేకుండా డబ్బులు అడుక్కుంటున్నవారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. వారికి ఆ దేవుడే సాయం చేయాలి’.. ‘సోము నువ్వు చాలా గ్రేట్.. ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు’ అని స్పందించారు.
ఇవి కూడా చదవండి
అది నోరా లేక క్రషరా.. గాజు ముక్కలను ఏం చేస్తున్నాడో చూడండి..
యజమాని ప్రేమ.. చనిపోయిన పిల్లి కోసం ఏకంగా..