AR Rahman: నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. తన వ్యాఖ్యలపై ఏఆర్ రెహమాన్ వివరణ
ABN , Publish Date - Jan 18 , 2026 | 02:42 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ వంటి సెలబ్రిటీలు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్.. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో సృజనాత్మకత లేనివారి రాజ్యం నడుస్తోందని, దీనికి మతపరమైన అంశం ఓ కారణమంటూ చేసిన ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. కంగనా రనౌత్ వంటి సెలబ్రిటీలు ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
‘కొన్ని సందర్భాల్లో ఒకరి ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నా మాటలతో ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టాలని అనుకోలేదు. భారతదేశం నాకు స్ఫూర్తి. ఇదే నా ఇల్లు. భారతీయుడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. నా భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశాన్ని ఈ దేశం నాకు కల్పించింది. సంగీతం ద్వారా ఉత్తేజపరచడం, గౌరవించడం, సేవ చేయడమే నా లక్ష్యం. ఎప్పుడూ ఎవరికీ బాధ కలిగించాలని కోరుకోలేదు. నా నిజాయతీని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
వేవ్స్ సమిట్‌లో ప్రధాని మోదీ ఎదుట ప్రదర్శించిన ‘ఝాలా’ సంగీతం నుంచి.. యువ నాగా సంగీతకారులతో కలిసి పని చేయడం వరకు, దేశంలో మొట్టమొదటి మల్టీకల్చరర్ వర్చువల్ బ్యాండ్‌ను సృష్టించడం నుంచి.. హాన్స్ జిమ్మర్‌తో కలిసి రామాయణం సినిమాకు సంగీతం అందించడం వరకు.. ప్రతి ప్రయాణం నా లక్ష్యాలను బలపర్చింది’ అని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు.
ఏఆర్ రెహమాన్ ఏమన్నారంటే..
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బాలీవుడ్‌లో తమిళ్ లేదా మహారాష్ట్రేతరులపై పక్షపాతం ఉంటుందా?’ అనే ప్రశ్న ఎదురైంది. ‘8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ‘పవర్ షిఫ్ట్’ నెలకొంది. సృజనాత్మకత లేని వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి మతపరమైన అంశమూ ఓ కారణం కావచ్చు. అది నాకు నేరుగా ఎప్పుడూ ఎదురుకాలేదు. కానీ గుసగుసలు వినిపించాయి. నేను పని కోసం వెతకను. చిత్తశుద్ధి ఉంటే పనే మన వద్దకు వస్తుందని నమ్ముతా’ అని రెహమాన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
7 పరుగులకే 5 వికెట్లు.. మ్యాచ్ చివర్లో అదిరే ట్విస్ట్.!