Minister Kollu Ravindra: అభివృద్ధిని అడ్డుకుంటే తరిమి కొడతాం.. జగన్‌కు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jan 18 , 2026 | 06:56 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధిని అడ్డుకుందామని చూస్తున్న జగన్‌ను తరిమికొడదామని హెచ్చరించారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం, జనవరి18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధిని అడ్డుకుందామని చూస్తున్న జగన్‌ను తరిమికొడదామని పిలుపునిచ్చారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన చీడ పురుగుని తరిమికొడదామన్నారు. ఆదివారం మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్థంతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహంతో పాటు నగరంలోని పలు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బస్టాండ్ సెంటర్‌లో పేదలకు అన్నదానాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ని మరువలేమని చెప్పుకొచ్చారు. సంక్రాంతి వేడుకలు తెలుగు వారి ఐక్యతను చాటాయని తెలిపారు. ప్రపంచ దేశాల నుంచి తెలుగు వారు కదలి వచ్చి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడరం పర్యటన ముగించుకుని విదేశాలకు సీఎం..
మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
For More AP News And Telugu News