Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా.. మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:15 PM
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వదులుకుని తప్పు చేశానని అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు..
సంగారెడ్డి, జనవరి18 (ఆంధ్రజ్యోతి): పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వదులుకుని తప్పు చేశానని అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు. ఆదివారం పటాన్‌చెరు జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో తన అనుచరులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుచరులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఇసుమంతైనా లాభం లేదు..
కాంగ్రెస్‌లో ఇసుమంతైనా లాభం జరగలేదని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఎలాంటి మేలూ జరగలేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటిల్లోని 104 కౌన్సిలర్లను గెలిపించేందుకు ఆయా విభాగాల వారీగా పని చేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News