Share News

Dhoni Kohli lookalikes: ఒకే బైక్‌పై ధోనీ, కోహ్లీ షికారు.. అసలు సంగతి తెలిస్తే షాక్..

ABN , Publish Date - Jan 18 , 2026 | 06:44 PM

ధోనీ అంటే కోహ్లీకి ప్రత్యేక అభిమానం. కోహ్లీని ధోనీ కూడా మంచి స్నేహితుడిలా భావిస్తాడు. వీరిద్దరూ కలిసి రద్దీ ట్రాఫిక్‌లో ఒకే బైక్‌పై షికార్లు కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్‌పై ధోనీ, కోహ్లీ కనిపించారు.

Dhoni Kohli lookalikes: ఒకే బైక్‌పై ధోనీ, కోహ్లీ షికారు.. అసలు సంగతి తెలిస్తే షాక్..
Dhoni Kohli lookalikes

మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ, కింగ్ కోహ్లీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ధోనీ సారథ్యంలోనే కోహ్లీ స్టార్‌గా ఎదిగాడు. ధోనీ అంటే కోహ్లీకి ప్రత్యేక అభిమానం. కోహ్లీని ధోనీ కూడా మంచి స్నేహితుడిలా భావిస్తాడు. వీరిద్దరూ కలిసి రద్దీ ట్రాఫిక్‌లో ఒకే బైక్‌పై షికార్లు కొడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైక్‌పై ధోనీ, కోహ్లీ కనిపించారు (MS Dhoni lookalike).


ధోనీ బైక్ నడపుతుండగా కోహ్లీ వెనుక కూర్చున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే నిజానికి వారు ధోనీ, కోహ్లీ కాదు. అలాగని అది ఏఐ వీడియో కూడా కాదు. వారు ధోనీ, కోహ్లీలా కనిపించే వేరే వ్యక్తులు. ముఖ్యంగా బైక్ నడుపుతున్న వ్యక్తి దాదాపు ధోనీలాగానే కనబడుతున్నాడు. దీంతో చాలా మంది వారిని చూసి షాకవుతున్నారు. aviraaj._ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (Virat Kohli lookalike).


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 90 లక్షల మందికి పైగా వీక్షించారు (trending viral clip). దాదాపు 40 వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. 'కోహ్లీ 60 శాతం, ధోనీ 90 శాతం' అని ఒకరు పేర్కొన్నారు. 'మీషో నుంచి వచ్చిన ధోనీ, కోహ్లీలా ఉన్నారు' అంటూ ఒకరు క్రియేటివ్‌గా కామెంట్ చేశారు. కాగా, 2025, డిసెంబర్ 1వ తేదీన దక్షిణాఫ్రికాతో వన్డే ఆడడం కోసం ధోనీ స్వస్థలమైన రాంచీకి కోహ్లీ వెళ్లాడు. ఆ సమయంలో ధోనీ ఇంటికి వెళ్లాడు. తన ఇంటి నుంచి టీమిండియా బస చేసిన హోటల్‌కు కోహ్లీని ధోనీ కార్‌లో తీసుకెళ్లిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది.


ఇవి కూడా చదవండి..

వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..


మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిని 30 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 18 , 2026 | 06:45 PM