Italy Squad: వరల్డ్ కప్-2026 ఇటలీలోకి సౌతాఫ్రికా ప్లేయర్
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:22 PM
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును ఆ దేశ క్రికెట్ ప్రకటించింది. ఈ టీమ్‌కు గతంలో సౌతాఫ్రికా తరఫున ఆడిన ఓ ప్లేయర్ ఎంపికయ్యాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచ కప్-2026ను(T20 World Cup) నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నీకి ఇటలీ తొలిసారి అర్హత సాధించింది. అందులో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఇటలీ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ప్లేయర్ వేన్ మ్యాడ్సన్ సారథ్యం వహించనున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జట్టు ఎంపికలో ఓ షాకింగ్ నిర్ణయం చోటుచేసుకుంది.
సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడిన జేజే స్మట్స్ అనే 37 ఏళ్ల ఆల్‌రౌండర్.. ఇటలీ ప్రపంచ కప్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2017-21 మధ్య కాలంలో దక్షిణాప్రికా జాతీయ జట్టులో స్మట్స్ సభ్యుడిగా ఉన్నాడు. ప్రొటీస్ తరఫున 6 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్, స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన స్మట్స్.. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినధ్యం వహిస్తున్నాడు. ఇటలీ మహిళను స్మట్స్ వివాహమాడటంతో ఆ దేశ పౌరసత్వం పొందాడు.
ఇక.. ఈ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైన వేన్ మాడ్సెన్ కూడా గతంలో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో క్లబ్ క్రికెట్ ఆడాడు. అతడు 2023లో ఇటలీ తరఫున 4 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలానే 253 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 117 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు.
టీ20 ప్రపంచ కప్‌లలో పాల్గొనే టీమ్‌లలో ఇటలీ గ్రూప్-సిలో ఉంది. ఆ జట్టుతో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు కూడా ఇదే గ్రూప్‌లోనే ఉన్నాయి. ఇటలీ జట్టు(Italy squad) ఫిబ్రవరి 9న బంగ్లాదేశ్ మ్యాచ్‌తో టీ20 వరల్డ్‌కప్ అరంగేట్రం చేయనుంది. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 12న ముంబైలో నేపాల్‌తో తలపడుతుంది.
ఇటలీ జట్టు:
వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జేజే స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా
ఇవి కూడా చదవండి:
7 పరుగులకే 5 వికెట్లు.. మ్యాచ్ చివర్లో అదిరే ట్విస్ట్.!