Lokesh Comments on Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఏపీ మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే
ABN , Publish Date - Sep 09 , 2025 | 07:13 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జూబ్లీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఢిల్లీ, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై (Jubilee Hills Bye Election) ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (AP Minister Nara Lokesh) స్పందించారు. జూబ్లీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఇవాళ(మంగళవారం) ఢిల్లీలో మీడియాతో నారా లోకేష్ మాట్లాడారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీడీపీలోకి తీసుకోవడం లాంటిదేనని విమర్శించారు. జగన్ బెంగళూరులో ఉంటున్నారని, ఏపీలో వాతావరణం సెట్ అయిందని తెలిపారు. చాలా సందర్భాల్లో మాజీ మంత్రి కేటీఆర్ తనను కలిశారని.. అది సోషల్ అకేషన్ అని, కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు మంత్రి నారా లోకేష్ .
2029లో కూడా మోదీకి మద్దతు ఇస్తాం...
‘టీడీపీ పార్టీ ఆఫీసు కార్యకర్తల ఆఫీస్. అక్కడే ప్రజల ఫిర్యాదులు తీసుకుంటున్నాం. సీఎంను కలవాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి కదా. ఢిల్లీలో ఉన్న బీజేపీ ఆఫీస్ కన్నా.. అమరావతిలో టీడీపీ ఆఫీస్ పెద్దది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ఏపీలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఇతర అంశాలపై చర్చించాం. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా నడుస్తుందో ప్రధాని మోదీకి వివరించా. స్వదేశీ వస్తువులను ప్రమోట్ చేయాలని ప్రధాని చెప్పారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎన్నికల్లో పనికిరాదు. రాష్ట్రంలో గంజాయి వాడకం తగ్గింది, ఇంకా త్వరలో నిర్మూలిస్తాం. నక్సలిజం తగ్గింది, డ్రగ్స్‌ను తగ్గించాలి. ఏపీకి సంక్షేమం, అభివృద్ధి రెండు అవసరం. ఎన్డీఏ అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ని అడగండి. 2029లో కూడా మేము మోదీకి మద్దతు ఇస్తాం’ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
దేవాన్ష్ రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు..
‘దేవాన్ష్ రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని అనుకుంటున్నారు..?. దేవాన్ష్ హ్యాపీగా చెస్ ఆడుకుంటున్నాడు. 12 లక్షల మంది పిల్లలు గత ఏడాది స్కూల్ డ్రాపౌట్ అయ్యారు. విద్య వ్యవస్థను పటిష్టం చేస్తాను. ఫైబర్‌నెట్‌ను టాటా సంస్థకు ఇచ్చే చర్చ జరగలేదు. డ్రిప్ ఇరిగేషన్‌పై గతంలో జగన్ ఎందుకు శ్రద్ధ పెట్టలేదో అర్థం కావడం లేదు. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు ఎవరూ కూడా అవినీతి జరగలేదని చెప్పడం లేదు. లిక్కర్‌లో కూటమి ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోవడం లేదు, పారదర్శకంగా వ్యవహారిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆర్భాటాలు చేయడం లేదు. ప్రభుత్వం ఖర్చులు తగ్గించింది. అమరావతిలో మేము ఇల్లు కడుతున్నాం, హెలికాప్టర్ ల్యాండింగ్ స్థల నిర్మాణం కూడా మా సొంత పైసలతో నిర్మిస్తున్నాం. ఏపీలో పలు స్టేడియాల నిర్మాణాలు కూడా చేపడుతున్నాం’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..ఎందుకంటే..
For More Telangana News and Telugu News..