High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:48 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. నల్గొండలో వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మూడు కేసులను హైకోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు (KTR) తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) ఊరట లభించింది. నల్గొండలో వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మూడు కేసులను కొట్టివేసింది హైకోర్టు. గతేడాది జరిగిన పదోతరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌పై (Question Paper Leak Case) కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల మేరకు మూడు పోలీస్ స్టేషన్‌లలో కేటీఆర్‌పై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ తమ పేర్లను ఎలా చెబుతారని కాంగ్రెస్ (Congress) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై కేసులను నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ కేసులను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు కేటీఆర్.
అయితే, కేటీఆర్‌పై దాఖలైన మూడు పిటిషన్లపై విచారణ చేపట్టారు జస్టిస్ కె.లక్ష్మణ్. రాజకీయ కక్షల కారణంగా కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది రమణరావు న్యాయస్థానానికి తెలిపారు. కాగా, ఈ పిటీషన్లపై హై కోర్టులో ఇరువైపులా వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం కేటీఆర్‌పై నమోదైన కేసులను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత సంచలన కామెంట్స్..
గ్రూప్ 1 పరీక్ష ఫలితాల రద్దు.. హరీష్ రావు ఘాటు రియాక్షన్..
For More Telangana News and Telugu News..