Kavitha Comments on Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:49 PM
ఉపరాష్ట్రపతి ఎన్నికపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి వన్నె తెస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగం పట్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంకితభావం ఉందన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 09: ఉపరాష్ట్రపతి ఎన్నికపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి సుదర్శన్ రెడ్డి వన్నె తెస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగం పట్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంకితభావం ఉందన్నారు. మంగళవారం నాడు ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని జాగృతి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి కవిత నివాళులర్పించారు. ఇదే సమయంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి కూడా నివాళులర్పించారు కవిత.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి కృషి చేస్తుందన్నారు. ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు వస్తామని.. సామాజిక తెలంగాణ సాధించేవరకు జాగృతి కృషి చేస్తుందని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. తెలంగాణ సాధనలో బొంత పురుగునైనా ముద్దాడుతానన్న కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు పోతామని కవిత చెప్పుకొచ్చారు. లెఫ్ట్ టు రైట్ అందర్నీ కులుపుకుని ముందుకు వెళతామన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి వచ్చుంటే సామాజిక తెలంగాణ కోసం కృషి చేసేవారని కవిత పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని రాజకీయంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారామె.
ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపైనా కీలక కామెంట్స్ చేశారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచే హైదరాబాద్‌కు తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. రూ. 1500 కోట్ల ప్రాజెక్టును రూ. 7,500 కోట్లకు పెంచారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్మును మెగా కృష్ణా రెడ్డికి దోచి పెడుతున్నారంటూ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కుంభకోణంలో భాగంగానే ప్రాజెక్టు అంచనాలు పెంచారని ఆరోపించారు.
Also Read:
Bengaluru News: నీ భర్తను వదిలేసి రా.. నేను పెళ్లి చేసుకుంటాను..
Picture Puzzle: మీ కళ్ల శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 31 సెకెన్లలో కనిపెట్టండి
For More Telangana News and Telugu News..