Share News

Bengaluru News: నీ భర్తను వదిలేసి రా.. నేను పెళ్లి చేసుకుంటాను..

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:36 PM

నీ భర్తను వదిలేసి రా నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను’ అని మాజీ ప్రియుడు ఆమెను నమ్మించారు. నన్ను ప్రేమించావు. వేరే వాళ్లతో పెళ్లిచేసుకుని పోతే నేను ఏమికావాలి అని రోజూ ఫోన్‌ చేసి ప్రేమను ఒలకపోశాడు. మాయ మాటలు నమ్మి పెళ్లి చేసుకున్న భర్తనే కాదనుకుని ప్రియుడు వద్దకు వెళ్లింది.

Bengaluru News: నీ భర్తను వదిలేసి రా.. నేను పెళ్లి చేసుకుంటాను..

- నమ్మించి.. గొంతు కోశాడు.. ఏం జరిగిందంటే..

- ప్రియుడి మాటలు నమ్మి భర్తను వదిలేసి వెళ్లిన మహిళ

- పెళ్లికి నిరాకరించడంతో వివాదం

- గాజు సీసాతో గొంతు కోసేందుకు ప్రయత్నించిన ప్రియుడు

- పోలీసులకు ఫిర్యాదు

బళ్లారి(బెంగళూరు): ‘నీ భర్తను వదిలేసి రా నేను నిన్ను పెళ్లిచేసుకుంటాను’ అని మాజీ ప్రియుడు ఆమెను నమ్మించారు. నన్ను ప్రేమించావు. వేరే వాళ్లతో పెళ్లిచేసుకుని పోతే నేను ఏమికావాలి అని రోజూ ఫోన్‌ చేసి ప్రేమను ఒలకపోశాడు. మాయ మాటలు నమ్మి పెళ్లి చేసుకున్న భర్తనే కాదనుకుని ప్రియుడు వద్దకు వెళ్లింది. అయితే తీరా ప్రియుడు మాత్రం ఆమెను మోసం చేశాడు. ఏకంగా ఆమె గొంతు పై గాజు సీసా పగలకొట్టి దానితో గొంతు కోసే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన కొప్పళ లోని మహనాద్‌ నగరంలో జరిగింది.


pandu4.2.jpg

కొప్పళ పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం కొప్పళ లోని మహనాద్‌ నగరకు చెందిన షమీనా అనే యువతిని కుష్టిగి గ్రామానికి చెందిన ఖలీల్‌ అనే వ్యక్తితో గత మూడేళ్ల క్రితం పెళ్లి చేశారు. షమీనా కొప్పళ్‌లోని మహనాద్‌ నగర్‌లో ఉండే రమేష్‌ అనే వ్యక్తితో పెళ్లికి ముందు నుంచే ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకున్నా షమీనాతో రమేష్‌ రోజూ ఫోన్‌లో మాట్లాడేవారు. నీ భర్తను వదిలి వచ్చే నేను నిన్ను తిరిగి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. ఆమె మాటలు నమ్మి రమేష్‌ వద్దకు చేరుకుంది.


అయితే రమేష్‌ పెళ్లికి నిరాకరించాడు. నిన్నే నమ్మి వచ్చాను ఇలా వదిలేస్తే ఎలా అని ఆమె నిలదీసింది. రమేష్‌ ఆమే నుంచి ఎలాగైనా బయట పడాలని భావించి అక్కడ ఉండే నీటికాలువ వద్దకు తీసుకుపోయి గాజు సీసాను పగలగొట్టి గొంతు మీద కత్తి పెట్టి చంపే ప్రయత్నం చేశాడు. ఆమె అవవరడంతో రోడ్డు పక్క వెళ్లే వారు వచ్చి రక్షించారు. ఈవిషయం బాధిత రాలు కొప్పళ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 09 , 2025 | 01:59 PM