TS Group 1 Mains Merit list Cancelled: గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేసిన హైకోర్టు
ABN , Publish Date - Sep 09 , 2025 | 10:58 AM
గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేసింది.
హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్(Group 1 Mains)పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తిరిగి మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని సూచించింది. రీవాల్యుయేషన్‌కు 8 నెలలు సమయం ఇచ్చింది. ఒక వేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీ (TGPSC) కి జస్టీస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఆదేశించింది.
ఏప్రిల్ నెలలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మ్యూలంకనంలో అవకతవకలు జరిగాయని కొంతమంది గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల వాదనలతో ఏకీభవించింది. మెయిన్స్ మెరిట్ లిస్ట్ రద్దు చేస్తూ కీలక తీర్పును ఇచ్చింది. పేపర్లు రీ వాల్యూయేషన్ చేయాలని, కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, హైకోర్టు తీర్పుపై TGPSC సమీక్షిస్తోంది. అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులు ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి తుది నియామకాలు పెండింగ్‌లో ఉండటంతో ఆందోళనలో పడ్డారు. మరోవైపు పలువురు గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
డిప్యూటీ సీఎం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు
For More Latest News