Dy CM Udayanidhi: డిప్యూటీ సీఎం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:38 AM
అంబులెన్స్‌లు వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమించి రోడ్‌షోలు చేస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీ ఐసీయూలో చేరటం ఖాయమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) జోస్యం చెప్పారు. సైదాపేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆరంతస్థుల ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు.
- త్వరలో ఐసీయూలోకి అన్నాడీఎంకే
- డిప్యూటీ సీఎం ఉదయనిధి ఫసైదాపేటలో కొత్త ఆస్పత్రి ప్రారంభం
చెన్నై: అంబులెన్స్‌లు వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమించి రోడ్‌షోలు చేస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీ ఐసీయూలో చేరటం ఖాయమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) జోస్యం చెప్పారు. సైదాపేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆరంతస్థుల ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రు లు కేఎన్ నెహ్రూ, ఎం.సుబ్రమణ్యం, డిప్యూటీ మేయర్ మహేన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ సీఎం స్టాలిన్(CM Stalin) నాయకత్వంలోని డీఎంకే ద్రావిడ తరహాపాలనలో విద్య, వైద్యానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హాయంలో వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల కారణంగానే చెన్నై నగరం దేశంలోనే వైద్య రాజధానిగా పేరుతెచ్చుకుందన్నారు. ప్రజల వద్దకే వైద్యం పథకానికి ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసాపత్రాన్ని బహూకరించిందని చెప్పారు.

ప్రధాన ప్రతిపక్ష నేత ఈపీఎస్ రాష్ట్రంలోని ప్రధాన రహదారులను ఆక్రమించి రోడ్‌షోలు చేస్తున్నారని, ఇటీవల ఓ అంబులెన్స్ ఆయన సభలకు హాజరైన జనం మధ్య వెళుతుండగా డ్రైవర్‌ను, డాక్టర్‌ను బెదరింపు ధోరణితో దుర్భాషలాడారని, ఆ సంఘటనను చూసిన ప్రజలంతా ఆయనపై ఏవగించుకున్నారన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోవటం తథ్యమని, ఈపీఎస్ కూడా ఐసీయూలో చేరి చికిత్స పొందే పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రూ.30కోట్లతో మెరుగుపరచిన విరుగంబాక్కం కాలువ కూడా ఉదయనిధి ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ
Read Latest Telangana News and National News