CM Revanth Reddy Meets Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..ఎందుకంటే..
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:14 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు.
ఢిల్లీ, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala Sitharaman) సమావేశం అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains), వరదల వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనాలను ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కి ఇచ్చింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రత్యేక నిధులతో పాటు, రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్‌రెడ్డి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత సంచలన కామెంట్స్..
For More Telangana News and Telugu News..