ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jan 29 , 2026 | 07:07 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jan 29, 2026 21:43 IST
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు
సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, పలువురు మంత్రులతో పాటు 20 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన టీపీసీసీ
-
Jan 29, 2026 21:12 IST
కేసీఆర్ లేఖపై స్పందించిన సిట్
కేసీఆర్ విచారణకు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం.
తదుపరి విచారణ తేదీపై నిర్ణయం తీసుకోనున్న సిట్.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ విచారణపై.. న్యాయ సలహా తీసుకుని మరో నోటీస్ ఇవ్వనున్న సిట్.
-
Jan 29, 2026 20:46 IST
ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా కార్యాచరణ.
క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.
-
Jan 29, 2026 20:16 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులకు కేసీఆర్ స్పందన
రేపు విచారణకు హాజరుకాలేనని సిట్‌కు కేసీఆర్ లేఖ
మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణ వాయిదా వేయాలని కోరిన కేసీఆర్.
విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించండి: కేసీఆర్
బాధ్యత గల పౌరుడిగా చట్టానికి పూర్తిగా సహకరిస్తా: కేసీఆర్
రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చట్టప్రకారం వ్యవహరించాలి: కేసీఆర్
ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారణ జరపాలని కోరిన కేసీఆర్
భవిష్యత్ నోటీసులు ఎర్రవల్లి నివాసానికే పంపాలని కేసీఆర్ విజ్ఞప్తి.
-
Jan 29, 2026 18:21 IST
విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం.
కేసులో ఏ1 జనార్ధన్, ఏ2 జగన్మోహన్‌కు బెయిల్ మంజూరు.
కండిషన్ బెయిల్ ఇచ్చిన ఎక్సైజ్ కోర్టు.
రేపు జైలు నుంచి విడుదల కానున్న అద్దేపల్లి బ్రదర్స్.
ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్న అద్దేపల్లి బ్రదర్స్.
-
Jan 29, 2026 17:48 IST
మేడిగడ్డ బ్యారేజ్‌కు కేంద్రం రెడ్ అలర్ట్
కేటగిరి-1 ప్రమాదకర డ్యామ్‌గా మేడిగడ్డ గుర్తింపు.
2025 పోస్ట్ మాన్సూన్ తనిఖీలో తీవ్ర లోపాలు గుర్తింపు.
మేడిగడ్డ లోపాలు పరిష్కరించకపోతే ప్రమాదమని హెచ్చరిక.
మేడిగడ్డ భద్రతపై తక్షణ చర్యలకు కేంద్రం ఆదేశాలు.
నివారణ చర్యలు అమలు చేయాలని తెలంగాణ సర్కార్‌కు సూచన.
-
Jan 29, 2026 17:13 IST
జగన్ పాదయాత్ర ప్రకటనపై వైఎస్ షర్మిల సెటైర్లు
జగన్ పాదయాత్ర ఇప్పుడెందుకు.. అధికారం కోసమేగా?: షర్మిల
అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు జగన్ ఏం చేశారు?: షర్మిల
జలయజ్ఞం పేరుతో YSR చేపట్టిన ప్రాజెక్టులను వైసీపీ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదు?: షర్మిల
ఎన్నికల హామీలను జగన్ ఎందుకు నెరవేర్చలేదు?: షర్మిల
-
Jan 29, 2026 17:04 IST
ములుగు : మేడారానికి పోటెత్తిన భక్తజనం.
చిలకలగుట్ట నుంచి గద్దెపైకి రానున్న సమ్మక్క.
ప్రత్యేక పూజలు చేసి చిలుకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకురానున్న పూజారులు.
సమ్మక్క వచ్చే చిలకలగుట్ట - గద్దెల మార్గం శుభ్రం చేసి ముగ్గులు వేస్తున్న మహిళలు.
గద్దెపైకి సమ్మక్క చేరడంతో జాతర పరిపూర్ణం.
-
Jan 29, 2026 16:56 IST
కేంద్ర ఆర్థిక సర్వేలో అమరావతి ప్రస్తావన
అమరావతి లాంటి కొత్త నగరాల నిర్మాణానికి ఇదే సరైన సమయం: ఆర్థిక సర్వే
ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం: ఆర్థిక సర్వే
భూహక్కుల వ్యవస్థలో డిజిటల్ విప్లవం.. ఏపీ రీసర్వే ప్రాజెక్టు: ఆర్థిక సర్వే
-
Jan 29, 2026 16:48 IST
ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్‌కు సిట్ నోటీసులు: కవిత
సిట్ విచారణ నాన్ సీరియస్‌గా జరుగుతోంది: కవిత
ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ పూర్తిచేసే ఉద్దేశం ఉందా.. లేదా?: కవిత
ఫోన్ ట్యాపింగ్ చేసినవారికి శిక్షలు పడాల్సిందే: కవిత
-
Jan 29, 2026 16:07 IST
హైదరాబాద్: నందినగర్ కేసీఆర్ నివాసానికి పోలీసులు
కేసీఆర్ ఇంటి పరిసరాలను పరిశీలించిన పోలీసులు.
శుక్రవారం నాడు నందినగర్ నివాసంలోనే కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం.
సిట్ నోటీసులపై కాసేపట్లో స్పందించనున్న కేసీఆర్.
-
Jan 29, 2026 16:03 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
222 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్.
76 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ.
-
Jan 29, 2026 15:40 IST
హైదరాబాద్: పాతబస్తీ సుల్తాన్‌పురాలో మృతదేహాల కలకలం.
ఓ ఫ్లాట్‌లో సోదరుడు షకీల్, సోదరి సర్వార్ బేగం మృతదేహాలు.
40 ఏళ్లుగా ఒకే ఫ్లాట్‌లో ఉంటున్న షకీల్, సర్వార్ బేగం.
ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాల తరలింపు, కేసు నమోదు.
-
Jan 29, 2026 15:37 IST
కామారెడ్డి: బీబీపేట మండలం జనగామలో విషాదం
ఉరి వేసుకుని నవ వధువు అనూష ఆత్మహత్య.
-
Jan 29, 2026 15:22 IST
తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నేత కేసీఆర్: కేటీఆర్
నోటీసులు, బెదిరింపులతో చరిత్ర చెరిపేయలేరు: కేటీఆర్
తెలంగాణ ఉద్యమం, ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వానివి కక్ష సాధింపు రాజకీయాలు: కేటీఆర్
కాంగ్రెస్ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం: కేటీఆర్
-
Jan 29, 2026 15:05 IST
గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ వివాదంపై ABN ఆంధ్రజ్యోతి స్పందన
బీఆర్ఎస్ నేత రవీందర్‌రావును గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అనడంపై విచారం వ్యక్తం చేస్తున్నాం: ABN ఆంధ్రజ్యోతి
అదే స్ఫూర్తితో జర్నలిస్టులను పిచ్చి నా కొడుకులు అనడంపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందిస్తుందని భావిస్తున్నాం: ABN ఆంధ్రజ్యోతి
బీఆర్ఎస్ నేత రవీందర్‌రావు కూడా జర్నలిస్టులపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నాం: ABN ఆంధ్రజ్యోతి
-
Jan 29, 2026 15:00 IST
నాంపల్లి అగ్నిప్రమాద ఘటనను సీరియస్‌గా తీసుకున్న హైడ్రా
జీహెచ్ఎంసీ, ఫైర్ అధికారులతో కలిసి నాంపల్లిలోని పలు ఫర్నిచర్ షాపుల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనిఖీలు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్టాడెండ్ ఫర్నిచర్ షాపు సీజ్ చేసిన హైడ్రా.
-
Jan 29, 2026 13:56 IST
కేసీఆర్ వయసు దృష్టిలో పెట్టుకుని సిట్ పలు సూచనలు
విచారణ కోసం పీఎస్‌కు తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదు: సిట్
కేసీఆర్ కోరుకుంటే జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణకు హాజరుకావొచ్చు: సిట్
లేకుంటే హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరిన చోట విచారిస్తాం: సిట్
మీకు అనుకూలమైన ప్రదేశాన్ని ముందుగానే చెప్పండి: నోటీసుల్లో సిట్
-
Jan 29, 2026 13:18 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు
నందినగర్‌లోని కేసీఆర్ ఇంట్లో సిబ్బందికి నోటీసులు ఇచ్చిన సిట్
CRPC 160 కింద నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు
రేపు మ.3గంటలకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్
విచారణ స్థలం ఎంపిక అవకాశం కేసీఆర్‌కే ఇచ్చిన సిట్
హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరిన చోట విచారించనున్న సిట్
రేపు విచారణకు అందుబాటులో ఉండాలని నోటీస్‌లో పేర్కొన్న సిట్
ఇప్పటికే కేటీఆర్, హరీష్, సంతోష్‌రావును ప్రశ్నించిన సిట్
-
Jan 29, 2026 12:51 IST
సీఎం, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో అభివృద్ధి: అనిత
ఏపీ పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: హోంమంత్రి వంగలపూడి అనిత
అనకాపల్లి ఉత్సవ్‌ను ఈనెల 30, 31 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తాం: అనిత
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఆధ్వర్యంలో ఏపీ పర్యాటకం అభివృద్ధి: అనిత
అనకాపల్లి ఉత్సవ్ నేపథ్యంలో ముత్యాలమ్మపాలెం తీరంలో ఏర్పాట్లు పరిశీలించిన అనిత
-
Jan 29, 2026 12:45 IST
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
పుణె: ముగిసిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు
బారామతి ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అంత్యక్రియలు నిర్వహించిన అజిత్ పవార్ పెద్ద కుమారుడు
హాజరైన కేంద్ర మంత్రులు అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్
వేలాదిగా తరలివచ్చి తమ అభిమాన నేతకు తుడి వీడ్కోలు పలికిన పవార్ అభిమానులు
-
Jan 29, 2026 12:12 IST
కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే కేసీఆర్‌ను ప్రశ్నించాలని భావిస్తున్న సిట్
రేపు కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం
ఇప్పటికే కేటీఆర్, హరీష్, సంతోష్‌రావును ప్రశ్నించిన సిట్
-
Jan 29, 2026 12:11 IST
గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం
హైదరాబాద్: గాంధీభవన్‌లో నిజామాబాద్ ముఖ్యనేతల సమావేశం
హాజరైన మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్, ఉత్తమ్
జీవన్‌రెడ్డి, సంజయ్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు
-
Jan 29, 2026 11:50 IST
ఘోర రోడ్డుప్రమాదం
కాకినాడ: రాయుడుపాలెం సెంటర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం
కేంద్రీయ విద్యాలయ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా
ఈ ప్రమాదంలో నాలుగో తరగతి విద్యార్థిని ఐశ్వర్యకి తీవ్రగాయాలు
వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ చిన్నారి మృతి
-
Jan 29, 2026 11:17 IST
రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబించింది: ప్రధాని మోదీ
పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నో సూచనలు చేశారు: ప్రధాని మోదీ
రాష్ట్రపతి వ్యాఖ్యలను సభ్యులు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తా: ప్రధాని మోదీ
బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనవి: ప్రధాని మోదీ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు: ప్రధాని మోదీ
భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన గౌరవం: ప్రధాని మోదీ
-
Jan 29, 2026 11:13 IST
ఏపీ లిక్కర్ కేసు.. నిందితులకు బెయిల్
ఏపీ లిక్కర్ కేసులో ఇద్దరు నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత
రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాష్‌రెడ్డి పిటిషన్లు కొట్టేసిన ఏపీ హైకోర్టు
సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడుకు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
-
Jan 29, 2026 11:10 IST
రణ్‌వీర్‌సింగ్‌పై కేసు నమోదు
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌పై బెంగళూరులో కేసు నమోదు
హిందువుల మత విశ్వాసాలు కించపరుస్తూ వ్యాఖ్యానించారని ఫిర్యాదు
పలు సెక్షన్ల కింద బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌పై కేసు నమోదు
-
Jan 29, 2026 10:48 IST
నార్త్ ఈస్ట్ కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం
టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే కూలిపోయిన విమానం
నోర్టే డి శాంటాండర్ ప్రావిన్సులో కూలిన సాటేనా ఎయిర్‌లైన్ బీచ్‌క్రాఫ్ట్ 1900D వాణిజ్య విమానం
ఈ ప్రమాదంలో 15మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడి
కొలంబియా-వెనెజువెలా సరిహద్దు సమీపంలో ప్రమాదం
-
Jan 29, 2026 10:45 IST
భారత్‌లో భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
నేడు ట్రేడింగ్ ఆరంభంలోనే సుమారు రూ.12వేలు పెరిగిన మేలిమి బంగారం ధర
రూ.30 వేల మేర ఎగబాకిన వెండి ధర
-
Jan 29, 2026 10:40 IST
స్పీకర్ నోటీసులు అందలేదు: ABNతో MLA దానం నాగేందర్
పిటిషనర్‌కి నోటీసులు అంది ఉండవచ్చు: దానం నాగేందర్
నోటీసులపై న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్నా: MLA దానం
స్పీకర్ ఏం అడుగుతారో సమాధానం చెప్తా: దానం నాగేందర్
స్పీకర్ ప్రశ్నలను బట్టి నా సమాధానాలు: MLA దానం నాగేందర్
-
Jan 29, 2026 10:39 IST
పదవుల కోసం నేను ఎక్కడికీ వెళ్లలేదు: ABNతో MLA దానం
నియోజకవర్గ ప్రజల బాగు కోసం నిర్ణయాలు: దానం నాగేందర్
సేవ చేయాలనే ఉద్దేశం తప్ప పదవుల కోసం పాకులాడలేదు: దానం
ఎంతవరకు అయితే అంతవరకు పోరాడుతా: ABNతో MLA దానం
-
Jan 29, 2026 10:35 IST
మేడారం: నేడు గద్దెనెక్కనున్న సమ్మక్క
బుధవారమే గద్దెపైకి చేరుకున్న సారలమ్మ
చిలకలగుట్ట నుంచి గద్దెపైకి రానున్న సమ్మక్క
సమ్మక్క రాకతో పరిపూర్ణం కానున్న జాతర
మరోవైపు మేడారానికి చేరుకున్న పలువురు మంత్రులు
-
Jan 29, 2026 09:22 IST
కాకినాడ: కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం
గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొని ఒకరి మృతి
16వ నంబర్ జాతీయ రహదారిపై లారీ యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా ఢీకొట్టిన మరో లారీ
ఒక్కసారిగా లారీలో చెలరేగిన మంటలు.. లారీ డ్రైవర్ సజీవ దహనం
-
Jan 29, 2026 09:15 IST
ఏపీలో పలుచోట్ల ACB అధికారుల దాడులు
విజయనగరం, రేణిగుంటలో ACB సోదాలు
విజయనగరంలో హోంగార్డ్ శ్రీనివాసరావు నివాసం, బంధువుల ఇళ్లపై ACB దాడులు
విజయనగరం, విశాఖలో ఆయన బంధువుల నివాసాల్లో ACB సోదాలు
రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఉద్యోగి తిరుమలేష్ నివాసాలపైనా దాడులు
రేణిగుంట, తిరుపతి, నెల్లూరులోని 5 ప్రాంతాల్లో ACB తనిఖీలు
-
Jan 29, 2026 09:14 IST
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
భారతీయ విద్యార్థుల ఆహ్వానంతో HBS క్యాంపస్‌లో సీఎం రేవంత్ పర్యటన
HBS విద్యార్థుల కెరీర్, సవాళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి చర్చ
తన విజయమంత్రాన్ని విద్యార్థులతో పంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రైజింగ్ విజన్‌ను వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి
భారత అభివృద్ధిలో యువత పాత్ర కీలకం: రేవంత్‌రెడ్డి
తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా విద్యార్థులు వ్యవహరించాలని రేవంత్ పిలుపు
-
Jan 29, 2026 08:56 IST
పాత పన్ను విధానం రద్దు చేస్తారా, లేదా?..
ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
ఇప్పటికే బడ్జెట్‌పై అనేక ఆశలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజలు
తమకు ఊరటనిచ్చేలా కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతుందని ఆశిస్తున్న సామాన్యులు
గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా వేతన జీవులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేంద్రం
ఈ ఏడాది పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా, లేదా? అని జోరుగా చర్చ
-
Jan 29, 2026 08:47 IST
అజిత్ పవార్ అంత్యక్రియలు.. అప్డేట్..
ఇవాళ ఉదయం11:00 గంటలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం
పుణే జిల్లా బారామతి సమీపంలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
అజిత్ పవార్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్..
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తదితురులు హాజరు
రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించిన సీఎం ఫడ్నవీస్
-
Jan 29, 2026 07:48 IST
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు
విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరుకానున్న ప్రధాని, అమిత్ షా
హాజరుకానున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండే
3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం
-
Jan 29, 2026 07:47 IST
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఇరాన్ వైపు మరో యుద్ధ నౌక దూసుకొస్తుందన్న అమెరికా
అమెరికా బెదిరింపులకు భయపడేది లేదు: ఇరాన్
అమెరికా దాడులు చేస్తే ఊరుకోం: ఇరాన్
అమెరికా చర్చలకు వస్తే అంగీకరిస్తాం: ఇరాన్
మిలటరీ చర్యలకు పాల్పడితే సహించేది లేదు: ఇరాన్
-
Jan 29, 2026 07:46 IST
రెండో రోజు వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శన
ప్రత్యేక ఆకర్షణగా పలు విమానాలు
రేపు, ఎల్లుండి సాధారణ ప్రజలకు అనుమతి
-
Jan 29, 2026 07:45 IST
ఆల్ టైమ్ రికార్డ్ ధరలు నమోదు చేస్తున్న బంగారం, వెండి
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో రోజుకో కొత్త రికార్డ్ నమోదు
ఇవాళ ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,67,090
22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి రేటు రూ.1,53,160
తొలిసారిగా రూ.4 లక్షల మార్క్ దాటిన కిలో వెండి
-
Jan 29, 2026 07:08 IST
UGC కొత్త నిబంధనలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
జనరల్ కేటగిరిపై వివక్ష చూపుతున్నారని వినీత్ జిందాల్ పిటిషన్
3(c) నిబంధన అమలును నిలిపివేయాలని పిటిషన్
-
Jan 29, 2026 07:08 IST
విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షో
నేటి నుంచి మూడురోజులపాటు ఫ్లవర్ షో నిర్వహణ
సందర్శకులను ఆకట్టుకునేలా పుష్పాల అలంకరణలు
-
Jan 29, 2026 07:07 IST
నేడు పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే
2025-26 సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
ప్రశ్నోత్తరాల తర్వాత ఆర్థిక సర్వే టేబుల్ చేయనున్న ఆర్థికమంత్రి