నటుడు రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏం జరిగిందంటే?
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:51 AM
కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాంతార’లోని పవిత్రమైన దేవ కోల సన్నివేశాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ స్టేజ్‌పై ఎగతాళి చేశాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దురంధర్(Durandhar) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) చిక్కుల్లో పడ్డారు. ఆయనపై బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కాంతార’ సినిమాలో పవిత్రమైన ‘దైవ కోల’ సంప్రదాయాన్ని స్టేజ్‌పై ఎగతాళి చేశాడన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. గతేడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2025(IFFI-2025) ముగింపు వేడుకల్లో రణ్‌వీర్ సింగ్, ‘కాంతార’ నటుడు రిషభ్ శెట్టి పాల్గొన్నారు. అయితే రణ్‌వీర్.. ఆ సినిమాలోని రిషభ్ క్యారెక్టర్ హావభావాలు పలికించారు. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. రణ్‌వీర్ సింగ్ సంప్రదాయాలను ఎగతాళి చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
రణ్‌వీర్ సింగ్ చేష్టలు కోట్లాది హిందువుల, ముఖ్యంగా తుళు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని బెంగళూరుకు చెందిన న్యాయవాది ప్రశాంత్ మేథల్.. కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు.. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో బెంగళూరులోని ది హై గ్రౌండ్ పోలీసులు రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:
ప్రభుత్వ లాంఛనాలతో పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని
పనిమనుషులుగా చేరి రూ.18 కోట్లు కొట్టేశారు!