కొలంబియాలో కూలిన విమానం.. 15 మంది దుర్మరణం
ABN , Publish Date - Jan 29 , 2026 | 08:26 AM
ఈశాన్య కొలంబియాలో ఒక చిన్న సాటేనా విమానం కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కుకుటా నుంచి ఒకానానుకు బయల్దేరిన కొద్ది నిముషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: నార్త్ ఈస్ట్ కొలంబియా(Northeast Colombia)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే నోర్టే డి శాంటాండర్ ప్రావిన్సులో బుధవారం సాటేనా ఎయిర్‌లైన్ బీచ్‌క్రాఫ్ట్ 1900D వాణిజ్య విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలంబియా - వెనెజువెలా సరిహద్దు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు అక్కడి ప్రభుత్వ విమానయాన సంస్థ సాటేనా ధ్రువీకరించింది.
ఈ ఘటనలో కొలంబియా ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ సభ్యుడు డియోజెనెస్ క్వింటెరో (Diogenes Quintero), ఎన్నికల అభ్యర్థి కార్లోస్ సాల్సెడోలు మరణించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. క్వింటెరో.. కొంత కాలంగా కాటాటుంబో ప్రాంతంలోని యుద్ధ బాధితుల తరఫున పోరాటం చేస్తున్నారని సమాచారం.
కుకుట విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 9 నిమిషాల్లోనే సిగ్నల్స్ తొలగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఫ్లైట్ కాలిపోయిందని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రతికూల వాతావరణం లేదా సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. విమాన ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఇవి కూడా చదవండి
కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్
వామ్మో.. ఇదెక్కడి ప్రేమ.. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తుందట..