అందుబాటులోకి సరికొత్త ఆధార్ యాప్
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:30 AM
సరికొత్త ఆధార్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌తోపాటు ఎంపిక చేసిన డేటాను మాత్రమే పంచుకోవడానికి, ఆధార్ సర్వీసులను సులభంగా...
న్యూఢిల్లీ, జనవరి 28: సరికొత్త ఆధార్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌తోపాటు ఎంపిక చేసిన డేటాను మాత్రమే పంచుకోవడానికి, ఆధార్ సర్వీసులను సులభంగా, సురక్షితంగా వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా మొబైల్ నంబరు, చిరునామాను అప్‌డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ జిరాక్స్ కాపీని ఇవ్వాల్సిన అవసరంలేకుండా ఎంపిక చేసిన ఆధార్ సమాచారాన్ని పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది.