Share News

101 ఏళ్ల వయసులోనూ వెరీ యాక్టివ్.. బామ్మ హెల్త్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:28 PM

చైనాకు చెందిన జియాంగ్ యోకిన్ 101 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుగ్గా తన పనులు తాను చేసుకుంటోంది. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవిస్తోంది. ఆమె డైట్ ఏంటో తెలిస్తే మనం తప్పకుండా షాక్ అవుతాం.

101 ఏళ్ల వయసులోనూ వెరీ యాక్టివ్.. బామ్మ హెల్త్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు
101-year-old Chinese woman

ఇంటర్‌నెట్ డెస్క్: చైనాకు చెందిన ఈ బామ్మ పేరు జియాంగ్ యోకిన్. ఈమె వయసు 101 ఏళ్లు. ఈ వయసులోనూ జియాంగ్.. ఎంతో చురుగ్గా తన పనులు తాను చేసుకుంటోంది. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవిస్తోంది. ఆమె ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఆమె డైట్ ఏంటో తెలిస్తే మనం తప్పకుండా షాక్ అవుతాం. జియాంగ్ జంక్ ఫుడ్ ఇష్టం వచ్చినట్లు తింటుంది. రాత్రి బాగా పొద్దుపోయే వరకు టీవీ చూస్తూ గడిపేస్తుంది. ఉదయం 10 గంటల తర్వాతే నిద్రలేస్తుంది. అంతేకాదు.. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కూడా ఆహారం తీసుకుంటుందట.


సాధారణంగా ఇన్ని ప్రమాదకరమైన అలవాట్లు ఉన్నవారు త్వరగా అనారోగ్యానికి గురై చనిపోవటం జరుగుతుంది. కానీ జియాంగ్ మాత్రం 101 ఏళ్లు వచ్చినా చాలా యాక్టివ్‌గా ఉంటూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జియాంగ్ గురించి ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘ఆమె అర్థరాత్రి 2 గంటల వరకు మేల్కొంటుంది. టీవీ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాతే నిద్రపోతుంది. తను చాలా ఈజీగా నిద్రలోకి జారుకుంటుంది. డీప్ స్లీప్‌లోకి వెళ్లిపోతుంది. ఆమె అర్థరాత్రి వేళ నిద్రపోవడానికి ఓ కారణం ఉంది. రెండేళ్ల క్రితం ఆమె చేతికి గాయం అయింది. డాక్టర్లు ఇంటి పనులు చేయకుండా రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక, అప్పటినుంచి పగటి పూట నిద్రపోవటం మొదలెట్టింది. రాత్రి ఆలస్యంగా నిద్రపోతూ ఉంది’ అని తెలిపారు.


తన హెల్త్ సీక్రెట్ గురించి 101 ఏళ్ల బామ్మ జియాంగ్ మాట్లాడుతూ.. ‘నేను బ్రేక్‌ఫాస్ట్ తినను. 11 గంటల తర్వాత భోజనం చేస్తాను. సాయంత్రం డిన్నర్ చేస్తాను. బాగా ఆకలిగా అనిపిస్తే రాత్రి పూట స్నాక్స్ తింటాను. జంక్ ఫుడ్ బాగా తీసుకుంటాను. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తింటాను. ఎలాంటి విషయంలోనైనా సరే ఒత్తిడికి గురికాను. చాలా ప్రశాంతంగా ఉంటాను. పాజిటివ్‌గా ఆలోచిస్తాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా నిద్రపోతాను’ అని చెప్పుకొచ్చింది.


ఇవి కూడా చదవండి

కార్లపై 40 శాతానికి సుంకం తగ్గింపు.. ఈయూతో భారత్ ట్రేడ్‌డీల్

వామ్మో.. ఇదెక్కడి ప్రేమ.. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తుందట..

Updated Date - Jan 26 , 2026 | 05:44 PM