కిష్త్వార్‌ను ముంచెత్తిన హిమపాతం.. భయానక దృశ్యాలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 29 , 2026 | 09:24 AM
జమ్ము కశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిష్త్వార్ జిల్లాలోని వార్వాన్ లోయలో భారీగా మంచు చరియలు విరిగిపడి ఉప్పెనలా దూసుకొచ్చిన భయానక దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: జమ్ము కశ్మీర్ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. అనంత్‌నాగ్ జిల్లా(Anantnag District) సరిహద్దులో ఉన్న కిష్త్వార్(Kishtwar)లో మంచు కరిగి ఉప్పెనలా ముంచుకొస్తున్న భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్వాన్ లోయ(Warwan Valley) సముద్ర మట్టానికి ఎత్తులో ఉండటం వల్ల అక్కడ పెద్దఎత్తున మంచు పేరుకుపోయింది. ఆ హిమం కరిగి ఎగువ ప్రాంతాల నుంచి దిగువకు ఉప్పెనలా దూసుకువస్తోంది. అయితే దీనివల్ల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
బుధవారం కూడా ఇదే స్థాయిలో కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హిల్ స్టేషన్ సోనామార్గ్(Sonamarg)లో భారీగా మంచు కమ్మేసింది. మంచు చరియలు కురిసిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైనుంచి మంచు ఒక్కసారిగా ప్రవాహం దూసుకురావడంతో పరిసర ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలు, రీసార్ట్స్ దెబ్బతిన్నాయి.
ఉత్తర భారతదేశ వ్యాప్తంగా కొన్నిరోజలుగా భారీగా మంచు కురుస్తోంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కొండ ప్రాంతమంతా మంచు కప్పివేసింది. రహదారులపై భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు(Temperatures) కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసమైతే తప్ప ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి:
ప్రభుత్వ లాంఛనాలతో పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని
పనిమనుషులుగా చేరి రూ.18 కోట్లు కొట్టేశారు!