Share News

ప్రభుత్వ లాంఛనాలతో పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని

ABN , Publish Date - Jan 29 , 2026 | 08:19 AM

విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలను నేడు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ప్రభుత్వ లాంఛనాలతో పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న ప్రధాని
Deputy CM Ajith Pawar last rites

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రమాదంలో మృతిచెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గురువారం ఉదయం 11:00 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఈ మేరకు పుణే జిల్లాలో బారామతి సమీపంలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో సంబంధిత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పవార్ అంత్యక్రియలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తదితురులు హాజరుకానున్నారు. ప్రజలు అంతిమ నివాళులర్పించేందుకు వీలుగా అజిత్ పవార్ భౌతికకాయాన్ని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఉంచారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం అకాల మరణంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా సెలవుతో పాటు మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు సీఎం ఫడ్నవీస్.


66 ఏళ్ల పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా.. పొగమంచు కారణంగా రన్‌వే కనిపించకపోవడంతో ల్యాండింగ్‌కు ముందు జరిగిన చార్టర్డ్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం కోసం బారామతికి వెళుతుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, ఓ సహాయకుడు, పవార్ వ్యక్తిగత భద్రతాధికారి ఉన్నారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం.. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు.


ఇవీ చదవండి:

అజిత్‌ వారసులెవరో!

వైఎస్సార్‌ నుంచి అజిత్‌ పవార్‌ వరకూ..!

Updated Date - Jan 29 , 2026 | 08:22 AM