అజిత్ మృతిపై సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలి: మమత
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:21 AM
విమాన ప్రమాదం, అజిత్ పవార్ మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు..
కోల్‌కతా/ముంబై, జనవరి 28: విమాన ప్రమాదం, అజిత్ పవార్ మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. బుధవారం ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. దేశంలో సామాన్యులతోపాటు రాజకీయ నాయకులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఈ ఘటన రుజువు చేసిందని పేర్కొన్నారు. ఏ దర్యాప్తు సంస్థ విచారణ చేసినా నిజాలు బయటికి రావని, సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలని కోరారు. కాగా, అజిత్ పవార్ మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదని, విమాన ప్రమాదాన్ని రాజకీయం చేయవద్దని ఆయన చిన్నాన్న, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు.