Share News

చుక్కలనంటిన పసిడి, వెండి ధరలు! రికార్డు స్థాయిలో..

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:26 AM

భారత్‌లో బంగారం వెండి రేట్స్ మరో ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేశాయి. మరి హైదరాబాద్‌లో తాజా ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి!

చుక్కలనంటిన పసిడి, వెండి ధరలు! రికార్డు స్థాయిలో..
Gold, Silver Rates on Jan 29

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రోజుకో కొత్త రికార్డును నమోదు చేస్తూ చెలరేగిపోతున్నాయి. బుధవారం కూడా భారత్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.5 వేలు, వెండి రూ.13 వేలు మేర పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (జనవరి 29) ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,67,090గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి రూ.1,53,160కు ఎగబాకింది. ఇక కిలో వెండి తొలిసారిగా రూ.4 లక్షల మార్కును దాటింది. ప్రస్తుతం ధర రూ.4,00,100 వద్ద కొనసాగుతోంది (Gold, Silver Prices in Hyderabad Jan 29).


అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి, వెండి రోజుకో ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 5,512 డాలర్లు, ఔన్స్ వెండి 118 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. బంగారం ధరలు ఈ ఏడాది చివరి నాటికి 7 వేల డాలర్ల మార్కును చేరుకోవచ్చని కూడా కొందరు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చితులతో పాటు డాలర్ బలహీనపడుతుండటంతో పసిడి, వెండికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (24కే, 22కే) ధరలు ఇలా

  • చెన్నై: ₹1,70,300; ₹1,56,110;

  • ముంబై: ₹1,67,090; ₹1,53,160;

  • న్యూఢిల్లీ: ₹1,67,240; ₹1,53,310;

  • కోల్‌కతా: ₹1,67,090; ₹1,53,160;

  • బెంగళూరు: ₹1,67,090; ₹1,53,160;

  • హైదరాబాద్: ₹1,67,090; ₹1,53,160;

  • విజయవాడ: ₹1,67,090; ₹1,53,160;

  • కేరళ: ₹1,67,090; ₹1,53,160;

  • పుణె: ₹1,67,090; ₹1,53,160;

  • వడోదరా: ₹1,67,140; ₹1,53,210;

  • అహ్మదాబాద్: ₹1,67,140; ₹1,53,210;

వెండి (కిలో) ధరలు ఇవీ

  • చెన్నై: ₹4,00,100

  • ముంబై: ₹3,80,100

  • న్యూఢిల్లీ: ₹3,80,100

  • కోల్‌కతా: ₹3,80,100

  • బెంగళూరు: ₹3,80,100

  • హైదరాబాద్: ₹4,00,100

  • విజయవాడ: ₹4,00,100

  • కేరళ: ₹4,00,100

  • పుణె: ₹3,80,100

  • వడోదరా: ₹3,80,100

  • అహ్మదాబాద్: ₹3,80,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో బీఏఎస్ఎఫ్‌‌ గ్లోబల్‌ డిజిటల్‌ హబ్‌

మారుతి సుజుకీ లాభం రూ.3,879 కోట్లు

Updated Date - Jan 29 , 2026 | 06:56 AM