Share News

మారుతి లాభం రూ.3,879 కోట్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:10 AM

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) మారుతి సుజుకీ రూ.3,879 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో...

మారుతి లాభం రూ.3,879 కోట్లు

న్యూఢిల్లీ: డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) మారుతి సుజుకీ రూ.3,879 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,727 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 4 శాతం వృద్ధిని కనబరిచింది. కొత్త లేబర్‌ కోడ్స్‌ అమలులో భాగంగా రూ.594 కోట్ల కేటాయింపులు జరపడం కంపెనీ లాభాల వృద్ధిపై ప్రభావం చూపింది. కాగా, ఈ క్యూ3లో మారుతి మొత్తం ఆదాయం రూ.49,904 కోట్లకు ఎగబాకింది.

Updated Date - Jan 29 , 2026 | 06:11 AM