Share News

అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్.. ఈ సారి ఏకంగా 16 వేల మంది..

ABN , Publish Date - Jan 28 , 2026 | 08:25 PM

గత ఏడాది అక్టోబర్ నెలలో అమెజాన్ 14 వేల వైట్ కాలర్ జాబ్స్‌ను తీసేసింది. తాజాగా, 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ పేర్కొంది.

అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్.. ఈ సారి ఏకంగా 16 వేల మంది..
Amazon 16,000 job cuts

ఇంటర్‌నెట్ డెస్క్: గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది. 30 వేల లేఆఫ్స్ టార్గెట్‌ను పూర్తి చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో అమెజాన్ 14 వేల వైట్ కాలర్ జాబ్స్‌ను తీసేసింది. తాజాగా, 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ పేర్కొంది. ఈ విషయాన్ని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటీ అధికారంగా వెల్లడించారు. అక్టోబర్ నెలలో చేపట్టిన సంస్థాగత మార్పులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.


కొత్త రోల్ వెతుక్కునేందుకు అమెరికా ఉద్యోగులకు 90 రోజుల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. 90 రోజుల గడువు లోగా కొత్త రోల్ వెతుక్కోని వారికి నిబంధన ప్రకారం ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు. కాగా, భారీ లేఆఫ్స్ కారణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రీసోర్సెస్‌ విభాగాలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ఈ విభాగాల్లో పని చేసే వారి ఉద్యోగాలు పెద్ద మొత్తంలో పోయాయని సమాచారం. అది కూడా కరోనా సమయంలో తీసుకున్న ఉద్యోగులను అమెజాన్ పెద్ద మొత్తంలో తొలగించింది. తీసేసిన ఉద్యోగుల స్థానంలో జనరేటివ్ ఏఐని వాడే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.


కొద్దిరోజుల క్రితం లేఆఫ్స్‌పై కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్థికపరమైన విషయాల వల్ల ఉద్యోగాలు తీసేయడం లేదని, అలాగని ఏఐ కారణంగానూ తొలగించడం లేదని అన్నారు. కంపెనీ సంప్రదాయంలో భాగంగానే లేఆఫ్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. ఏటా కొత్త ఉద్యోగులను తీసుకుంటూనే ఉంటామని తెలిపారు. అలాంటప్పుడు ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుందని, అందుకే లేఆఫ్స్ తప్పవని తేల్చి చెప్పారు.


ఇవి కూడా చదవండి

ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన

నయీం మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం..

Updated Date - Jan 28 , 2026 | 08:46 PM