హైదరాబాద్‌లో బీఏఎస్ఎఫ్ గ్లోబల్ డిజిటల్ హబ్
ABN , Publish Date - Jan 29 , 2026 | 06:21 AM
ఈ ఏడాది తొలి త్రైమాసికం చివరికల్లా హైదరాబాద్‌లో గ్లోబల్ డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అంతర్జాతీయ రసాయనాల కంపెనీ..
హైదరాబాద్(ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ ఏడాది తొలి త్రైమాసికం చివరికల్లా హైదరాబాద్‌లో గ్లోబల్ డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అంతర్జాతీయ రసాయనాల కంపెనీ బీఏఎస్ఎఫ్ బుధవారం ప్రకటించింది. కంపెనీ ప్రస్తుత గ్లోబల్ డిజిటల్ హబ్ నెట్‌వర్క్‌ను ఇది మరింత బలోపేతం చేయనుంది. బీఏఎస్ఎఫ్ ఇప్పటికే యూర్‌పలోని లడ్విగ్‌షాఫెన్, మాడ్రిడ్‌తోపాటు మలేషియాలోని కౌలాలంపూర్‌లో గ్లోబల్ డిజిటల్ హబ్‌లను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాలు కంపెనీ ప్రపంచవ్యాప్త వ్యాపారాల విస్తరణకు అవసరమైన డిజిటల్ సేవలను అందిస్తాయి.
ఇవి కూడా చదవండి
ఇందులో కుట్ర ఏమీ లేదు.. శరద్ పవార్ తొలి స్పందన
నయీం మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం..