పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమన్న ప్రధాని
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:36 AM
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రజల సంక్షేమమే కేంద్రంగా తమ నిర్ణయాలు, పథకాలు ఉంటాయని అన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని అన్నారు. ప్రజల అభివృద్ధి సౌభాగ్యాలే లక్ష్యంగా పథకాలు, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆధునిక సాంకేతికతలో మార్పులకు అనుగుణంగా తామూ మారతామని చెప్పారు. అయితే, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా తమ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటూ సాంకేతికతను జోడించి ముందుకు సాగుతామని అన్నారు. ప్రజల స్థానాన్ని సాంకేతికత భర్తీ చేయజాలదని కూడా ప్రధాని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని అన్నారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణమని చెప్పారు. ఇక ఈయూతో వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని తెలిపారు. ఈ ఒప్పందం నుంచి భారత పారిశ్రామిక వర్గాలు లబ్ధిపొందాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులను ఈయూ దేశాలకు అందించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అజిత్ పవార్ విమాన ప్రమాదం! లేడీ పైలట్ చివరి మెసేజ్ చూసి బామ్మ కన్నీరుమున్నీరు
కిష్త్వార్‌ను ముంచెత్తిన హిమపాతం.. భయానక దృశ్యాలు.. వీడియో వైరల్