Share News

పాతబస్తీలో విషాదం.. ఫ్లాట్‌లో అక్కాతమ్ముళ్ల అనుమానాస్పద మృతి..

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:24 PM

పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుల్తాన్‌పురా ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో రెండు మృతదేహాలు సంచలనంగా మారాయి. అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతదేహాలు.. మహమ్మద్ షకీల్, అతని సోదరి సర్వార్ బేగంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాతబస్తీలో విషాదం.. ఫ్లాట్‌లో అక్కాతమ్ముళ్ల అనుమానాస్పద మృతి..
Hyderabad Suspicious Incident

హైదరాబాద్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పాతబస్తీలోని సుల్తాన్‌పురా ప్రాంతంలో ఉన్న ఒక ఫ్లాట్‌లో అక్కాతమ్ముళ్ల మృతదేహాలు (Hyderabad Suspicious Incident) లభ్యమవడం సంచలనం సృష్టించింది. కొన్ని రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చర్యలు చేపట్టారు.


ఘటన వివరాలిలా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను మహమ్మద్ షకీల్, అతని సోదరి సర్వార్ బేగంగా పోలీసులు గుర్తించారు. వీరు గత 40 ఏళ్లుగా ఇదే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. సర్వార్ బేగం వికలాంగురాలు కావడంతో, ఆమె బాగోగులన్నీ సోదరుడు షకీలే చూసుకునేవాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా ఒకరికొకరు తోడుగా ఉంటున్నట్లు సమాచారం.


పోలీసుల దర్యాప్తు..

ఘటనా స్థలానికి చేరుకున్న మీర్ చౌక్ పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండటంతో.. వారు మృతి చెంది కొన్ని రోజులకు పైగానే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.


అనుమానాలు..

షకీల్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించి ఉండొచ్చని, వికలాంగురాలైన సర్వార్ బేగానికి ఆహారం అందించే వారు లేక ఆమె కూడా మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇతర కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తున్న ఈ తోబుట్టువుల మరణం.. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనపై మీర్ చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలియనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్‌

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కీలక నిబంధనలివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 05:09 PM