కాకినాడలో విషాదం.. ఆటో బోల్తా పడి చిన్నారి మృతి
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:21 AM
కాకినాడలో స్కూలుకు వెళ్తున్న ఓ చిన్నారిని మృత్యువు ఆటో రూపంలో కబళించింది. రాయుడుపాలెం సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐశ్వర్య అనే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు.
కాకినాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేంద్రీయ విద్యాలయ స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో.. రాయుడుపాలెం సెంటర్ వద్ద బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న ఐశ్వర్య అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వార్త విన్న చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు. మిగిలిన ఎనిమిది మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన విద్యార్థులందరినీ మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్(GGH)కు తరలించారు.
అధికారుల స్పందన..
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఆటోలో ఎక్కించడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్కూల్ వాహనాల డ్రైవర్లు అతివేగాన్ని నియంత్రించాలని, పిల్లల భద్రత విషయంలో నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ
Read Latest AP News And Telugu News