Share News

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:22 PM

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. పుణెలోని ప్రతిష్ఠాన్ మైదాన్‌లో అంతిమక్రియలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలికారు.

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
Ajit Pawar

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం ఉదయం పుణెలోని బారామతి సమీపంలోగల విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పవార్ పెద్దకుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు. అంతకముందు.. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శ్రద్ధాంజలి ఘటించారు. తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రతిష్ఠాన్ మైదానానికి ప్రజలు పోటెత్తడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ప్రభుత్వ లాంఛనాల నడుమ తండ్రి చితికి ఆయన కుమారుడు నిప్పంటించారు. అజిత్ పవార్‌కు తుది వీడ్కోలు పలుకుతూ ఆయన భార్య సునేత్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అజిత్ పవార్‌ను కోల్పోయినందుకు పార్టీ నేతలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.


ఇవీ చదవండి:

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమన్న ప్రధాని

అజిత్ పవార్ తరువాత ఎవరు? కీలక మలుపులో ‘మహా’ రాజకీయాలు

Updated Date - Jan 29 , 2026 | 12:40 PM