Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..

ABN , First Publish Date - Jan 23 , 2026 | 06:59 AM

ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్..
Breaking News

Live News & Updates

  • Jan 23, 2026 18:07 IST

    బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

    • వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ లీగల్ నోటీసులు

    • నిరాధార ఆరోపణలు చేసి తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించారని స్పీకర్ ఆగ్రహం

    • తనకు రూ.10కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్న గడ్డం ప్రసాద్

    పూర్తి కథనం

  • Jan 23, 2026 18:02 IST

    ముగిసిన మిధున్ రెడ్డి ఈడీ విచారణ

    • ఏడు గంటల పాటు మిధున్ రెడ్డిని విచారించిన ఈడీ

    • కోర్టు ఉత్తర్వులు ఉన్న కారణంగా ఏపీ లిక్కర్ స్కాంపై ఏమీ మాట్లాడలేనన్న మిథున్ రెడ్డి

  • Jan 23, 2026 18:00 IST

    7 గంటలుగా కొనసాగుతున్న కేటీఆర్ సిట్ విచారణ

    • జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేటీఆర్‌ను విచారిస్తున్న సిట్ అధికారులు

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

  • Jan 23, 2026 17:58 IST

    ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పించాలన్నదే నా సంకల్పం: మంత్రి తుమ్మల

    • ఖమ్మం నగరంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    • నగరం పరిశుభ్రంగా లేకపోతే.. రూ.కోట్లు పెట్టిన ప్రయోజనం ఉండదు: తుమ్మల

    • ప్రణాళికబద్ధంగా పనులు సాగితే ఇంకో రూ.100కోట్లు ఇస్తా: తుమ్మల

  • Jan 23, 2026 17:48 IST

    రిపబ్లిక్ డే.. స్కూళ్లకు బాంబు బెదిరింపులు!

    • యూపీలోని శివనాడార్ పాఠశాల సహా గుజరాత్‌లోని సెయింట్ కబీర్, సెయింట్ జేవియార్ స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్

    • అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపట్టిన అధికారులు

    • ఆ స్కూళ్లకు సెలవు ప్రకటించి విద్యార్థులను ఇంటికి పంపిన పాఠశాల యాజమాన్యం

    పూర్తి కథనం

  • Jan 23, 2026 17:34 IST

    తీవ్ర విషాదం.. స్కూల్‌లో జింక బొమ్మ మీద పడి చిన్నారి మృతి

    • అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటి పెదపూడి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తీవ్ర విషాదం

    • స్కూల్ ఆవరణలో జింక బొమ్మపై ఆడుతూ ప్రమాదవశాత్తు అది మీద పడి చిన్నారి జాహ్నవి(7) దుర్మరణం

  • Jan 23, 2026 17:30 IST

    గోదావరి పుష్కర పనులపై ఏపీ సీఎం సమీక్ష

    • జూన్ 2027లో 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలు

    • ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించనుండటం నా అదృష్టం: చంద్రబాబు

    • పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి: చంద్రబాబు

    • దేశవిదేశాల నుంచి సుమారు 10కోట్ల మంది పుష్కరాలకు వస్తారని అంచనా

  • Jan 23, 2026 17:25 IST

    మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

    • మేడారం జాతరకు రూ.3.70కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్రం

    • భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా నిధుల విడుదల

    • రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం రూ.140 కోట్లు వెచ్చిస్తోన్న కేంద్ర ప్రభుత్వం

    పూర్తి కథనం

  • Jan 23, 2026 17:11 IST

    విశాఖ రైల్వే స్టేషన్‌లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

    • కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురు సునీల్, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నితీష్ కుమార్ నుంచి నకిలీ కరెన్సీ స్వాధీనం

    • నిందితుల నుంచి రూ.3.32 లక్షల స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసిన పోలీసులు

  • Jan 23, 2026 17:09 IST

    దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధం

    • రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం

    • జనగణనలోనే కులగణన కూడా చేపట్టనున్న కేంద్రం

    • ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న తొలి దశ జనగణన

    • తొలిదశలో గృహ గణన కోసం ప్రశ్నావళిని రూపొందించిన కేంద్ర హోం శాఖ

    • 33 ప్రశ్నలతో గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం

  • Jan 23, 2026 17:01 IST

    రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న అమరావతి

    • అమ‌రావ‌తి రైతుల‌కు ప్రత్యేకంగా వీఐపీ గ్యాల‌రీ ఏర్పాటు

    • రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

    • మొత్తం 13 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్న సీఆర్డీఏ అధికారులు

  • Jan 23, 2026 16:55 IST

    సైనా నెహ్వాల్‌ను చూసి దేశం గర్విస్తోంది: ఏపీ సీఎం చంద్రబాబు

    • బ్యాడ్మింటన్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ట్వీట్

    • భారత బ్యాడ్మింటన్ చరిత్రలో బంగారు అధ్యాయాన్ని సైనా లిఖించింది: చంద్రబాబు

    • ఆమె సాధించిన విజయాలు యువతను బ్యాడ్మింటన్ కోర్టు వైపు నడిపించాయి: చంద్రబాబు

  • Jan 23, 2026 16:49 IST

    ట్రెండింగ్‌లో ‘హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్’

    • ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రముఖులు

    • ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ‘హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్’

    • దేశవ్యాప్తంగా రెండో స్థానంలో కొనసాగుతోన్న లోకేశ్ హ్యాష్‌ట్యాగ్

    పూర్తి కథనం

  • Jan 23, 2026 16:29 IST

    కల్తీ నెయ్యి వ్యవహారం.. 36 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్

    • తిరుమల కల్తీ నెయ్యి కేసులో తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్

    • మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చిన సిట్

    • వీరిలో 12 మంది టీటీడీ అధికారులు

    పూర్తి కథనం

  • Jan 23, 2026 16:23 IST

    నంద్యాల జిల్లాలో రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యం

    • నంద్యాల జిల్లా నూనెపల్లి రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యం

    • ఉడుమల్పురం గ్రామానికి చెందిన సురేంద్ర రెడ్డిగా గుర్తించిన పోలీసులు

    • హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

  • Jan 23, 2026 16:12 IST

    భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

    • సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద ముగింపు

    • 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద స్థిరపడిన నిఫ్టీ

    పూర్తి కథనం

  • Jan 23, 2026 16:07 IST

    అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

    • ఏపీ సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన 233, 244 ఎస్‌ఎల్‌బీసీ సమావేశం

    • రాష్ట్రంలో ఎవరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదు: చంద్రబాబు

    • వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దే రుణాలు తీసుకోవాలి: చంద్రబాబు

    పూర్తి కథనం

  • Jan 23, 2026 16:02 IST

    కల్తీ మద్యం కేసు.. జోగి బ్రదర్స్‌కు బెయిల్ మంజూరు

    • కల్తీ మద్యం కేసులో జోగి రమేశ్, జోగి రాముకు బెయిల్ మంజూరు చేసిన తంబళ్లపల్లి కోర్టు

    • ములకల చెరువు కేసులో జోగి బ్రదర్స్‌కు బెయిల్ మంజూరు

    • ఇటీవలే ఇబ్రహీంపట్నం కేసులోనూ బెయిల్ ఇచ్చిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు

  • Jan 23, 2026 15:59 IST

    సీతక్క పర్యటనలో ఉద్రిక్తత

    • జనగామలో మంత్రి సీతక్క పర్యటనలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

    • పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసే విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి మధ్య ఘర్షణ

    • ఇరువర్గాల మధ్య తోపులాట.. రంగంలోకి దిగిన పోలీసులు

  • Jan 23, 2026 15:56 IST

    ఐదు గంటలుగా కొనసాగుతోన్న మిథున్ రెడ్డి ఈడీ విచారణ

    • రెండున్నర గంటలకు భోజన విరామం ఇచ్చిన ఈడీ అధికారులు

    • భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన మిథున్ రెడ్డి విచారణ

    • ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శర్వాణి ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులు

  • Jan 23, 2026 15:54 IST

    కొండగట్టులో నారా లోకేశ్ జన్మదిన వేడుకలు

    • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు యువ నేతల ప్రత్యేక పూజలు

    • హైదరాబాద్ నుంచి 30 వాహనాల్లో ర్యాలీగా వచ్చి కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తెలుగు యువ నేతలు

    • అంజన్న ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని కోరిన యువ నేతలు

  • Jan 23, 2026 15:50 IST

    తిరుమల రథసప్తమి వేడుకలకు భారీ బందోబస్తు: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

    • రథసప్తమి సందర్భంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: ఏబీఎన్‌తో వెంకయ్య చౌదరి

    • 400 మంది టీటీడీ సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించాం: వెంకయ్య చౌదరి

    • ఏఐ టెక్నాలజీ ద్వారా క్రౌడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను పర్యవేక్షిస్తాం: వెంకయ్య చౌదరి

  • Jan 23, 2026 15:29 IST

    ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం

    • బుట్టాయగూడెం మండలం నాగుల గూడెం వద్ద ట్రాప్ కెమెరాకు చిక్కిన పెద్దపులి

    • ఆవును చంపి దాని పక్కనే కూర్చున్న పెద్దపులి

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అటవీశాఖ అధికారులు

  • Jan 23, 2026 15:25 IST

    టీ20 ప్రపంచ కప్ ఆడకపోతే.. బంగ్లాకు ఎంత నష్టమంటే?

    • టీ20 ప్రపంచ కప్ భారత్‌లో ఆడబోమని తేల్చి చెప్పిన బంగ్లా క్రికెట్ బోర్డు

    • తక్కువ సమయం ఉండటంతో వేదికల మార్పు కుదరని చెప్పిన ఐసీసీ

    • ఈ టోర్నీ నుంచి బంగ్లా వైదొలిగితే.. బీసీబీకి సుమారు రూ.240 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం

      పూర్తి కథనం

  • Jan 23, 2026 15:07 IST

    ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: టీపీసీసీ చీఫ్

    • ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్

    • ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే: మహేశ్ కుమార్

    • సొంత చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతున్నా కేటీఆర్ నుంచి సమాధానం లేదు: మహేశ్ కుమార్

  • Jan 23, 2026 14:54 IST

    ఈడెన్ గార్డెన్స్‌కు ఐసీసీ రేటింగ్

    • ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ 2026

    • కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని పరిశీలించిన ఐసీసీ, బీసీసీఐ బృందం

    • స్టేడియంలోని సౌకర్యాలు, పిచ్‌ను పరిశీలించి ‘సంతృప్తికరం’ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ

    పూర్తి కథనం

  • Jan 23, 2026 14:50 IST

    నారా లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

    • ఆంధ్రప్రదేశ్‌కు అంకితభావంతో సేవ చేయడంలో తనకు మంచి ఆరోగ్యం, నిరంతర విజయం లభించాలని కోరిన చిరంజీవి

    • లోకేశ్ ప్రయాణం సానుకూల మార్పును, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును తీసుకురావాలని ఎక్స్‌ వేదికగా పోస్ట్

  • Jan 23, 2026 13:36 IST

    వివాదాస్పదంగా మారిన అమెరికా వలసల శాఖ అధికారుల తీరు

    • మిన్నెసొటాలో ఐదేళ్ల చిన్నారి లియమ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు

    • అక్రమ వలసదారుడు ఏడ్రియన్ అలెగ్జాండర్ ఆరియాస్‌తోపాటు అతని కుమారుడినీ అదుపులోకి తీసుకున్న వైనం

    • ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు

    • ఘటనపై మండిపడిన అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్

    పూర్తి కథనం

  • Jan 23, 2026 13:29 IST

    వైద్య రంగంలో దూకుడు పెంచుతున్న టెక్ కంపెనీలు

    • ఏఐ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇచ్చేందుకు ముందడుగు

    • ఇటీవల చాట్‌జీపీటీ హెల్త్‌‌ను ప్రవేశపెట్టిన ఓపెన్ ఏఐ సంస్థ

    • చాట్‌బాట్ జెమినై ద్వారా తాము సేవలందిస్తామంటున్న గూగుల్

    • ఎస్ఏటీ పరీక్షకు సంబంధించిన ఉచిత మాక్ టెస్టులు పొందొచ్చని ప్రకటన

    • ఎక్స్ వేదికగా ప్రకటించిన ఆల్ఫ్‌బెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్

  • Jan 23, 2026 13:29 IST

    నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

    • నిందితుల రిమాండ్ ఫిబ్రవరి 5 వరకు పొడిగించిన ఎక్సైజ్ కోర్టు

    • నిందితులను వర్చువల్‌గా ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

    • భవానీపురం నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరు

    • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి బ్రదర్స్

  • Jan 23, 2026 13:28 IST

    అమరావతి: రైతుల ప్లాట్ల కేటాయింపులో గందరగోళం

    • గతంలో కేటాయించిన స్థానంలోనే ప్లాట్లు ఇస్తున్నారని రైతుల ఆగ్రహం

    • గతంలో వద్దన్న భూముల్లోనే ప్లాట్లు ఇవ్వడంపై అభ్యంతరం

    • తమకు ప్లాట్లు అవసరం లేదంటున్న రాజధాని రైతులు

    • అభ్యంతరాలున్న గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు తాత్కాలికంగా నిలిపివేత

  • Jan 23, 2026 13:27 IST

    కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోకుండా సాగదీస్తున్నారు: బండి సంజయ్

    • ట్యాపింగ్ చేసినవారినే.. ట్యాపింగ్ జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు: బండి సంజయ్

    • ట్యాపింగ్‌కు కారణమైన ప్రభాకర్‌రావును కాపాడుతున్నారు: బండి సంజయ్

    • AICC భవన్-ఫామ్‌హౌస్ మధ్య డీల్ కుదరలేదు: బండి సంజయ్

    • కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలంటే రేవంత్ భయపడుతున్నారు: సంజయ్

  • Jan 23, 2026 13:27 IST

    కేటీఆర్‌ను ఏ అంశంలో ప్రశ్నిస్తున్నారో స్పష్టం చేయాలి: బండి సంజయ్

    • సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు: బండి సంజయ్

    • BRS హయాంలో ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు: బండి సంజయ్

    • ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్ల దందా జరిగింది: బండి సంజయ్

    • హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఎలా లబ్ధి పొందారో అందరికీ తెలుసు

    • తన ఫోన్ ట్యాప్ అయిందని సీఎం కూడా చెప్పారు: బండి సంజయ్

  • Jan 23, 2026 13:25 IST

    ఫోన్‌ట్యాపింగ్‌ డైలీ సీరియల్‌లా నడుస్తోంది: బండి సంజయ్

    • విచారణ పేరుతో ప్రభుత్వం టైంపాస్ చేస్తోంది: బండి సంజయ్

    • కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు: బండి సంజయ్

    • సిట్ అధికారులకు ప్రభుత్వం స్వేచ్ఛ ఇవ్వడం లేదు: బండి సంజయ్

    • అసలు కేటీఆర్‌ను ఎందుకు పిలిచారు?: కేంద్రమంత్రి బండి సంజయ్

  • Jan 23, 2026 13:25 IST

    ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. చట్టబద్ధమే: RS ప్రవీణ్‌కుమార్

    • కాళేశ్వరం విషయంలోనూ BRSను బద్నాం చేశారు: RS ప్రవీణ్

    • ఫార్ములా-ఈ కేసులో అసలు ఏం తేల్చారు?: RS ప్రవీణ్‌కుమార్

    • ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. చట్టబద్ధమే: RS ప్రవీణ్‌కుమార్

    • ప్రజల భద్రత కోసం ఫోన్లు ట్యాప్ చేయడం సర్వసాధారణం: RS ప్రవీణ్

      పూర్తి కథనం

  • Jan 23, 2026 13:25 IST

    ఆత్మగౌరవం కాపాడేందుకే: RS ప్రవీణ్

    • తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు BRS పోరాడుతోంది: RS ప్రవీణ్

    • అలవికాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: RS ప్రవీణ్‌కుమార్

    • తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతున్నారు: RS ప్రవీణ్

    • నైనీ కోల్ బ్లాక్ దోపిడీని ప్రశ్నించినందుకే కేసులు: RS ప్రవీణ్‌కుమార్

  • Jan 23, 2026 13:23 IST

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తోన్న సిట్ బృందం

    • కేటీఆర్‌, టాస్క్‌ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్‌రావును కలిపి ప్రశ్నిస్తోన్న సిట్

    • వ్యాపారవేత్తలను బెదిరించి BRSకు విరాళాలు ఇప్పించిన వ్యవహారంపై ఆరా

    • BRS పార్టీ ఆర్థిక లావాదేవీలపై కేటీఆర్‌ను ప్రశ్నిస్తోన్న సిట్

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు

  • Jan 23, 2026 12:54 IST

    వైద్య రంగంలో దూకుడు పెంచుతున్న టెక్ కంపెనీలు

    • ఏఐ ద్వారా ఉచిత వైద్య సలహాలు ఇచ్చేందుకు ముందడుగు

    • ఇటీవల చాట్‌జీపీటీ హెల్త్‌‌ను ప్రవేశపెట్టిన ఓపెన్ ఏఐ సంస్థ

    • చాట్‌బాట్ జెమినై ద్వారా తాము సేవలందిస్తామంటున్న గూగుల్

    • ఎస్ఏటీ పరీక్షకు సంబంధించిన ఉచిత మాక్ టెస్టులు పొందొచ్చని ప్రకటన

    • ఎక్స్ వేదికగా ప్రకటించిన ఆల్ఫ్‌బెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్

    పూర్తి కథనం

  • Jan 23, 2026 12:44 IST

    ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

    • శంషాబాద్‌: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

    • తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్‌లో బుల్లెట్ గుర్తింపు

    • తనిఖీల్లో బుల్లెట్ గుర్తించిన సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు

    • తూటాను స్వాధీనం చేసుకుని నిందితుడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగింత

    పూర్తి కథనం

  • Jan 23, 2026 12:28 IST

    తారస్థాయికి చేరిన పొలిటికల్ వార్

    • అనంతపురం: తాడిపత్రిలో తారస్థాయికి చేరిన రాజకీయ పోరు

    • టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య కొనసాగుతున్న వార్

    • ఇరువర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం

    • రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

    • మీ ఇంటి వద్దే చర్చకు సిద్ధమని పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి సవాల్

    పూర్తి కథనం

  • Jan 23, 2026 12:20 IST

    అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభం

    • కేరళ: మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

    • తిరువనంతపురం నుంచి దేశవ్యాప్తంగా అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభం

    • తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి- తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్‌ సైతం ప్రారంభం

    • ఇప్పటికే చర్లపల్లి- ముజఫర్‌పూర్‌ మధ్య నడుస్తున్న అమృత్‌ భారత్‌ రైలు

    • తెలంగాణ రాష్ట్రానికి ఇది రెండో రైలు కావడం విశేషం

    పూర్తి కథనం

  • Jan 23, 2026 12:15 IST

    చుక్కల్ని తాకుతున్న బంగారం, వెండి

    • నేడు ఒక్కసారిగా ఎగబాకిన గోల్డ్, సిల్వర్ రేట్లు

    • 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.5400 మేర పెరిగి రూ.1.60లక్షలకు చేరువ

    • ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710

    • ఏకంగా రూ.20 వేల మేర పెరిగిన వెండి ధర

    • నేడు రూ.3.6 లక్షలకు చేరిన సిల్వర్ రేటు

    పూర్తి కథనం

  • Jan 23, 2026 11:59 IST

    సంచలన తీర్పు..

    • కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

    • బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేసిన హైకోర్టు

  • Jan 23, 2026 11:54 IST

    భారీగా కురుస్తున్న మంచు

    • జమ్మూకశ్మీర్: రాజౌరిలోని తన్నమండి ప్రాంతంలో భారీగా కురుస్తున్న మంచు

    • పిర్ పంజాల్ పర్వత శ్రేణుల ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న మంచువాన

  • Jan 23, 2026 11:50 IST

    నేడు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ జన్మదినం

    • మంత్రి లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ

    • లోకేశ్‌కు పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ శ్రేణులు శుభాకాంక్షలు

    • లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత

    పూర్తి కథనం

  • Jan 23, 2026 11:16 IST

    నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: ABNతో వేముల వీరేశం

    • తెలంగాణకు డ్రగ్, పబ్ కల్చర్ తెచ్చింది కేటీఆరే: వేముల వీరేశం

    • త్వరలో కేసీఆర్‌ను కూడా విచారణకు పిలుస్తారు: ఎమ్మెల్యే వేముల

    • ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ పరువు తీశారు: ABNతో వేముల వీరేశం

  • Jan 23, 2026 11:13 IST

    నంద్యాల విజయ డైయిరీ డైరెక్టర్ల ఎన్నికలో ట్విస్ట్‌

    • శాంతిభద్రతల దృష్టా ఎన్నికలు వాయిదా వేయాలని అంటున్న పోలీసులు

    • శాంతినగరం సొసైటీ ప్రెసిడెంట్‌ ఎన్నికకు నామినేషన్ వేసేందుకు వచ్చిన గంగుల ప్రమీలా రాణి

    • ఎన్నిక వాయిదా వేస్తున్నారనడంతో డెయిరీ దగ్గర గంగుల ప్రమీలా రాణి బైఠాయింపు

    • ఎన్నిక జరపకుండా వాయిదా వేయడంపై సమాధానం చెప్పాలని ప్రమీలా రాణి డిమాండ్‌

    పూర్తి కథనం

  • Jan 23, 2026 11:07 IST

    ఈడీ కార్యాలయానికి వైసీపీ ఎంపీ..

    • హైదరాబాద్: ఈడీ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

    • ఏపీ లిక్కర్ కేసులో మిథున్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న ఈడీ

  • Jan 23, 2026 11:06 IST

    రాజకీయ ప్రేరేపితం: హరీష్ రావు

    • ఫోన్ ట్యాపింగ్ రాజకీయ ప్రేరేపిత కేసు: హరీష్‌రావు

    • BRS నేతలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోంది: హరీష్‌రావు

  • Jan 23, 2026 11:05 IST

    విచారణకు హాజరైన కేటీఆర్

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేటీఆర్

    • కేటీఆర్‌ను ప్రశ్నిస్తోన్న జాయింట్ సీపీ విజయ్‌కుమార్, ACP వెంకటగిరి

    • BRS ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నిస్తోన్న సిట్ బృందం

    • కేటీఆర్ BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో ఉండటంతో విచారణ

  • Jan 23, 2026 11:04 IST

    తెలంగాణకు అమృత్ భారత్ రైలు..

    • తెలంగాణకు తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

    • చర్లపల్లి-తిరువనంతపురం మధ్య సూపర్‌ఫాస్ట్ రైలు

    • నేడు తిరువనంతపురం నుంచి ప్రారంభించనున్న మోదీ

  • Jan 23, 2026 11:03 IST

    పెద్దారెడ్డిపై కేసు

    • అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు

    • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కేతిరెడ్డిపై టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు

    • అనంతపురం, తాడిపత్రి పీఎస్‌లలో కేతిరెడ్డిపై కేసులు

  • Jan 23, 2026 11:03 IST

    అనంతపురం: తాడిపత్రిలో మరోసారి టెన్షన్.. టెన్షన్..

    • జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి ఇళ్ల దగ్గర పోలీసుల మోహరింపు

    • రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు పెద్దారెడ్డి సవాల్

    • పెద్దారెడ్డి ఇంటి దగ్గర చర్చకు సిద్ధమన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం

    • పోలీసుల ఆధీనంలో ఇద్దరు నేతల ఇళ్ల మధ్య ఉన్న కాలేజీ గ్రౌండ్‌

    • నిన్న కాలేజీ గ్రౌండ్‌లో ఉన్న రాళ్ల డంప్‌ను తొలగించిన పోలీసులు

  • Jan 23, 2026 11:01 IST

    మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు

    • ఒక్కరోజే రూ.5,400 పెరిగిన 24 క్యారెట్ల 10గ్రా. బంగారం

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400

    • కిలోపై రూ.20వేలు పెరిగి రూ.3,60,000కి చేరిన వెండి

  • Jan 23, 2026 11:00 IST

    నెల్లూరు: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ

    • ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్

    • 12 రాష్ట్రాల్లో 15 నెలలు కొనసాగిన సిట్ విచారణ

    • బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు కీలక సూత్రధారులుగా గుర్తింపు

    • తొలి చార్జ్‌షీట్‌లో 24 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్

    • మరో 12 మంది హస్తం ఉన్నట్టు కోర్టుకు తెలిపిన అధికారులు

    పూర్తి కథనం

  • Jan 23, 2026 10:59 IST

    నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న మిథున్‌రెడ్డి

    • ఏపీ లిక్కర్ కేసులో మిథున్‌రెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ

    • విదేశాలకు నగదు తరలింపు, షెల్ కంపెనీల ఏర్పాటుపై ఆరా

    • నిన్న విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ అధికారులు

  • Jan 23, 2026 10:59 IST

    నేడు సుభాశ్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన ప్రధాని మోదీ

    • భయమెరుగని నాయకత్వానికి, అచంచల దేశభక్తికి నేతాజీ ప్రతీక అని అభివర్ణన

    • నేతాజీ జయంతిని దేశం పరాక్రమ్ దివస్‌గా జరుపుకుంటోందని ప్రశంస

    • రాబోయే తరాలకు నేతాజీ స్ఫూర్తిగా నిలుస్తారని ఎక్స్ వేదికగా కొనియాడిన ప్రధాని

    పూర్తి కథనం

  • Jan 23, 2026 10:56 IST

    నా కుటుంబ సభ్యులను దూరం చేసేందుకు చూశారు: కేటీఆర్

    • రెండేళ్లుగా జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరు?: కేటీఆర్

    • ఎన్ని కేసులు పెట్టినా రాష్ట్రం కోసం పోరాడుతాం: కేటీఆర్

    • నా పరువుకు భంగం కలిగించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను: కేటీఆర్

    పూర్తి కథనం

  • Jan 23, 2026 10:56 IST

    హామీలు, స్కామ్‌ల నుంచి డైవర్షన్ కోసమే కుట్రలు: కేటీఆర్

    • కాంగ్రెస్‌ను బొంద పెట్టేవరకు నిద్రపోం: కేటీఆర్

    • విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా: కేటీఆర్

    • రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్

    • నేను రాష్ట్రం కోసం పనిచేశా.. ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు: కేటీఆర్

  • Jan 23, 2026 10:47 IST

    ఫోన్ ట్యాపింగ్‌తో మాకు సంబంధం లేదు: కేటీఆర్

    • విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా: కేటీఆర్

    • ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతా: కేటీఆర్

    • అటెన్షన్ డైవర్షన్ కోసమే కుట్రలు చేస్తున్నారు: కేటీఆర్

    • మంత్రులతో సహా మా అందరి ఫోన్లు రేవంత్ ట్యాప్ చేయిస్తున్నారు: కేటీఆర్

  • Jan 23, 2026 10:46 IST

    హైదరాబాద్: కాసేపట్లో జూబ్లీహిల్స్ పీఎస్‌కు కేటీఆర్

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరుకానున్న కేటీఆర్

    • కేటీఆర్‌ను ప్రశ్నించనున్న జాయింట్ సీపీ విజయ్‌కుమార్, ACP వెంకటగిరి

    • కేటీఆర్ వెంట జూబ్లీహిల్స్ పీఎస్‌కు హరీష్‌రావు

    • జూబ్లీహిల్స్‌ పీఎస్ దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

  • Jan 23, 2026 09:11 IST

    బాసర జ్ఞాన సరస్వతీ ఆలయానికి పోటెత్తిన భక్తులు

    • ఆదిలాబాద్: బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు

    • వసంత పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం

    • తెల్లవారుజామునే అమ్మవారికి మంగళ వాయిద్య, సుప్రభాత సేవలు

    • ముగ్గురు అమ్మవార్లకు అభిషేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు

    పూర్తి కథనం

  • Jan 23, 2026 07:41 IST

    నేడు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం

    • లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన సతీమణి నారా బ్రాహ్మణి

    • బాధ్యతతోపాటు సుదీర్ఘంగా పని చేసుకుని వెళ్లిపోతున్నారు: నారా బ్రాహ్మణి

    • మీరు చేస్తున్న ఈ త్యాగాన్ని మేము నిశబ్దంగా చూస్తున్నాం: నారా బ్రాహ్మణి

    • మార్పు తీసుకురావాలనే మీ నిబద్ధత మా అందరికీ స్ఫూర్తి: నారా బ్రాహ్మణి

    • ఈ ఏడాది మీకు ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నా: నారా బ్రాహ్మణి

    • నిత్యం మీ పక్కన నడవడం గర్వంగా ఉంది: నారా బ్రాహ్మణి

    పూర్తి కథనం

  • Jan 23, 2026 07:24 IST

    మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్

    • ఐరోపా దేశాలపై సుంకాల విషయంలో వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

    • ట్రంప్ నిర్ణయంతో తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

    • భారత్‌లో పసిడి ధర సుమారు రూ.2,200, వెండి రూ.5,000లు తగ్గుదల

    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,300

    • 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,41,440

    పూర్తి కథనం

  • Jan 23, 2026 07:18 IST

    దావోస్ లో తెలుగు నేతలు భేటీ..

    • స్విట్జర్లాండ్‌: దావోస్ వేదికగా భేటీ అయిన సీఎం రేవంత్, ఏపీ మంత్రి లోకేశ్

    • ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్‌)లో ఇరువురు నేతల కీలక సమావేశం

    • పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టీకరణ

    • ఈ సందర్భంగా రేవంత్‌ను మంగళగిరి శాలువాతో సత్కరించిన మంత్రి లోకేశ్‌

    పూర్తి కథనం

  • Jan 23, 2026 06:59 IST

    దావోస్ పర్యటన ముగించుకుని ఏపీకి రానున్న చంద్రబాబు

    • టాటా ప్రాజెక్టులపై ‘టాటా సన్స్‌’ చైర్మన్‌కు సీఎం చంద్రబాబు వినతి

    • దావోస్‌లో చంద్రశేఖరన్‌తో మర్యాదపూర్వక భేటీ

    • స్పోర్ట్స్‌ సిటీల్లో పెట్టుబడులకూ చంద్రశేఖరన్‌ సానుకూలత

    • గతేడాది దావోస్‌ పర్యటనతో ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం చంద్రబాబు

    • తాజా పర్యటనతోనూ సత్ఫలితాలే: చంద్రబాబు

    • 4 రోజుల పర్యటన ముగించుకుని వెనక్కి

    పూర్తి కథనం