Share News

తాడిపత్రిలో హైటెన్షన్.. పోలీసుల ఆధీనంలో కాలేజీ గ్రౌండ్

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:57 AM

తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.

తాడిపత్రిలో హైటెన్షన్.. పోలీసుల ఆధీనంలో కాలేజీ గ్రౌండ్
JC Prabhakar Reddy Vs Kethireddy Peddareddy

అనంతపురం, జనవరి 23: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే బహిరంగ సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మీ ఇంటి వద్దే చర్చకు సిద్ధమని పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు.


దీంతో తాడిపత్రిలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు నేతల నివాసాల మధ్యనున్న కాలేజీ గ్రౌండ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. ఆ గ్రౌండ్‌లో ఉన్న రాళ్ల డంప్‌ను ఇప్పటికే తొలగించారు. అలాగే పట్టణంలో ఆయా చోట్ల భారీగా మోహరించారు పోలీసులు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?

ఈ రోజే వసంత పంచమి.. ఈ విషయాలు తెలుసా?

For More AP News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 12:20 PM