భగ్గుమన్న బంగారం, వెండి ధరలు! ఒక్క రోజులోనే సీన్ రివర్స్
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:17 AM
గురువారం భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు శుక్రవారం ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మేలిమి బంగారం ధర రూ.5400ల మేర, వెండి రూ.20 వేల మేర పెరిగింది. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: నిన్న భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు ఒక్కసారిగా ఎగబాకాయి.10 గ్రాముల మేలిమి బంగారం ధర సుమారు రూ.5400 మేర పెరిగి రూ.1.60 లక్షలకు చేరువ అయ్యింది. వెండి ధర కూడా ఏకంగా రూ.20 వేల మేర పెరిగి రూ.3.6 లక్షలకు చేరింది. నేడు (జనవరి 23) ఉదయం 11.00 గంటల సమయంలో భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710గా ఉంది.
ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,400 వద్ద తచ్చాడుతోంది. వెండి ధర కూడా నేడు అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3.60 లక్షలకు చేరింది (Gold, Silver Rates Jan 23). డాలర్ బలహీనపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు కొత్త చైర్మన్ రానున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ మిన్నంటుతున్నాయని మార్కెట్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
ఎన్‌బీఎఫ్‌సీల బంగారం రుణాల ఏయూఎంలు రూ.4 లక్షల కోట్లకు..