Share News

టీ20 ప్రపంచ కప్ 2026.. ఈడెన్ గార్డెన్స్‌కు ఐసీసీ ఏమని రేటింగ్ ఇచ్చిందంటే?

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:29 PM

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో ఎక్కువ శాతం మ్యాచులు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం గురువారం ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించింది.

టీ20 ప్రపంచ కప్ 2026.. ఈడెన్ గార్డెన్స్‌కు ఐసీసీ ఏమని రేటింగ్ ఇచ్చిందంటే?
Eden Gardens

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఎక్కువ శాతం మ్యాచులు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్డేడియం వేదికగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం గురువారం ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించింది. స్టేడియంలోని సౌకర్యాలు, పిచ్‌ను పరిశీలించిన ఐసీసీ.. ఈడెన్స్ గార్డెన్స్‌(Eden Gardens)కు ‘సంతృప్తికరం’ అనే రేటింగ్ ఇచ్చింది.


‘ఐసీసీ(ICC) అధికారుల బృందం ఈడెన్ గార్డెన్స్‌ను సందర్శించింది. కార్పొరెట్ బాక్స్‌లను పరిశీలించి సౌకర్యాలపై ఆనందం వ్యక్తం చేసింది. మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ఐసీసీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది’ అని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వెల్లడించింది.


ఈడెన్ గార్డెన్స్ స్డేడియంలో గ్రూప్ స్టేజి(T20 World Cup 2026)లో మొత్తం ఐదు మ్యాచులు జరగనున్నాయి. మూడు ప్రారంభ మ్యాచుల్లో.. ఒక టీ20 ఈ మైదానం వేదికగానే జరగనుంది. పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి. ఆ జట్టు ఫలితాల ఆధారంగా.. సూపర్ 8, సెమీ ఫైనల్ మ్యాచులు కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే నిర్వహించే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కివీస్‌కు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌ కప్ నుంచి కీలక ప్లేయర్ ఔట్

అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్

Updated Date - Jan 23 , 2026 | 02:59 PM