Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 17 , 2026 | 06:29 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 17, 2026 21:45 IST

    నెల్లూరు: చేజర్ల మండలం కోటితీర్థంలో భూ వివాదం

    • ముగ్గురు మహిళలపై ఇద్దరు వ్యక్తుల దాడి

    • మహిళలకు తీవ్ర గాయాలు, పోలీసులకు ఫిర్యాదు

  • Jul 17, 2026 21:43 IST

    మెక్సికోలో భారీ భూకంపం

    • భూకంప తీవ్రత 7.3గా నమోదు

    • సునామీ హెచ్చరికల జారీ

  • Jul 17, 2026 21:37 IST

    నాగర్‌కర్నూల్‌: వెల్దండ మండలం పోతేపల్లిలో విషాదం

    • ఇద్దరు పిల్లలతో సహా నీటిసంపులో పడి తల్లి ఆత్మహత్య

    • మృతులు శిరీష్(23), మాన్యశ్రీ(2), వర్షిత్‌(3 నెలలు)గా గుర్తింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 17, 2026 21:19 IST

    తిరుమల: అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం

    • మోకాలి మెట్ల సమీపంలో భక్తులకు కనిపించిన చిరుత

    • అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది

    • భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్న భద్రతా సిబ్బంది

  • Jul 17, 2026 21:16 IST

    వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్(89) కన్నుమూత

    • వెస్టిండీస్ క్రికెట్ ఆల్‌రౌండర్ గ్యారీ సోబర్స్‌

    • 93 టెస్టుల్లో 26 సెంచరీలు చేసిన గ్యారీ సోబర్స్‌

    • 93 టెస్టుల్లో 235 వికెట్లు తీసిన గ్యారీ సోబర్స్‌

  • Jul 17, 2026 20:06 IST

    మీనాక్షి నటరాజన్‌ అంశంపై CEC జ్ఞానేష్‌కుమార్‌ స్పందన

    • ఆర్వో నిర్ణయమే ఫైనల్‌: CEC జ్ఞానేశ్వర్‌కుమార్‌

    • ఫారం పూర్తిచేయడానికి అవకాశం ఉన్నా చేయలేదు: CEC జ్ఞానేశ్వర్‌కుమార్‌

    • ఆర్వో నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది: CEC జ్ఞానేశ్వర్‌కుమార్‌

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 19:55 IST

    హైదరాబాద్: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు షాక్

    • జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు

    • ఈ నెల 12న ఫిల్మ్ ఫెడరేషన్‌పై జానీ మాస్టర్ వ్యాఖ్యలు

    • జానీ మాస్టర్ వ్యాఖ్యలపై ఫెడరేషన్ సీరియస్

    • ఈ నెల 14న విచారణకు పిలిచినా రాలేదని ఆగ్రహం

    • వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం

  • Jul 17, 2026 19:54 IST

    అమరావతి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

    • ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి: సీఎం చంద్రబాబు

    • పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి: సీఎం చంద్రబాబు

    • హార్టికల్చర్ హబ్‌కు నిధులు ఇవ్వండి: సీఎం చంద్రబాబు

    • మేధోమథన కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్: సీఎం చంద్రబాబు

  • Jul 17, 2026 19:31 IST

    జింబాబ్వే మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

    • నేను ఆర్సీబీతోనే ఉంటా: ఆండీ ఫ్లవర్

    • ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా వెళ్లడం లేదు: ఆండీ ఫ్లవర్

  • Jul 17, 2026 19:29 IST

    తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

    • ధరణిపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

    • ధరణి ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకూ దర్యాప్తు

    • 4 ప్రాజెక్టుల అంచనాల పెంపుపై కేబినెట్‌లో చర్చ

  • Jul 17, 2026 18:32 IST

    ‘బుల్లెట్ రైలు ప్రాజెక్టు జాప్యానికి భారతీయులే కారణం’

    • జపాన్ మాజీ మంత్రి హిడికే మకిహారా ఆరోపణ

    • భారత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వ్యాఖ్య

    • స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపణ

    • ఇచ్చిన హామీలకు కట్టుబడి లేరని అసంతృప్తి

    • చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న భారత వర్గాలు

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 18:15 IST

    బ్రిటన్ నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్‌

    • ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్న ఆండీ బర్న్‌హామ్‌

  • Jul 17, 2026 18:00 IST

    తెలంగాణ ప్రభుత్వానికి CJI జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రశంసలు

    • రూ.100 కోట్లతో న్యాయవాదుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం అభినందనీయం: CJI జస్టిస్‌ సూర్యకాంత్‌

  • Jul 17, 2026 17:45 IST

    రైల్వే ప్రయాణికుల అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • ఇకపై 'రెండో తరగతి ప్రయాణికులు' అని పిలవొద్దు: సుప్రీం

    • 'క్లాస్‌' విభజన రైలు కోచ్‌లకు ఉండాలి కానీ ప్రయాణికులకు కాదు: సుప్రీంకోర్టు

    • ప్రయాణికులను రెండో తరగతి అని పిలవడం రాజ్యాంగ సమానత్వ స్ఫూర్తికి విరుద్ధం: సుప్రీంకోర్టు

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 17:29 IST

    హైదరాబాద్: సీఎం రేవంత్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ భేటీ

    • పలు ప్రాజెక్టులకు సవరించిన అంచనాలపై చర్చ

    • పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల అంశంపై చర్చ

    • మెట్రో విస్తరణ అంశంలో కేంద్రం వైఖరిపై చర్చ

    • బుల్లెట్‌ రైళ్ల అలైన్‌మెంట్లపై చర్చించే అవకాశం

  • Jul 17, 2026 17:27 IST

    భూరికార్డులు పౌరసత్వానికి రుజువు కాదు: కలకత్తా హైకోర్టు

    • విదేశీయులూ భారత్‌లో భూమి కొనుగోలు చేయొచ్చన్న హైకోర్టు

    • దేశంలోకి అక్రమంగా చొరబడ్డట్టు ఆరోపణలున్న వ్యక్తి కేసులో వ్యాఖ్య

    • పౌరసత్వాన్ని నిరూపించే మరో డాక్యుమెంట్ తీసుకురావాలని ఆదేశం

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 17:21 IST

    అమరావతి: అంగన్వాడీల చిరకాల కోరిక నెరవేరింది: మంత్రి సంధ్యారాణి

    • అర్బన్, రూరల్ అంగన్వాడీ సిబ్బందికీ పథకం వర్తింపు: మంత్రి సంధ్యారాణి

    • అంగన్వాడీల సంక్షేమానికి సీఎం ఎల్లప్పుడూ పెద్దపీట: మంత్రి సంధ్యారాణి

    • జీతాల పెంపు, గ్రాట్యుటీ తర్వాత 'తల్లికి వందనం' వరం: మంత్రి సంధ్యారాణి

  • Jul 17, 2026 17:18 IST

    అమరావతి: అంగన్‌వాడీ సిబ్బందికి సీఎం చంద్రబాబు శుభవార్త

    • అంగన్‌వాడీలకు 'తల్లికి వందనం' పథకం వర్తింపు

    • టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు పథకం అమలు

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 17:18 IST

    అమరావతి: పారదర్శకంగా అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు: మంత్రి లోకేశ్

    • ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష

    • ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్

    • కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు వర్క్ ఫోర్స్ సిద్ధం చేయాలి: లోకేశ్

    • ITIలను పరిశ్రమలతో అనుసంధానించి స్కిల్ గ్యాప్ భర్తీ చేయండి: మంత్రి నారా లోకేశ్

  • Jul 17, 2026 17:16 IST

    తెలంగాణలో ఆగస్ట్ 15 నుంచి మహిళలకు కొత్త పెన్షన్లు

    • ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్ల పంపిణీ: మంత్రి సీతక్క

    • క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించాలని అధికారులకు మంత్రి ఆదేశం

  • Jul 17, 2026 17:08 IST

    లేఆఫ్స్‌ రక్షణలు కావాలి.. గూగుల్ సీఈఓకు వర్కర్ల పిటిషన్

    • లేఆఫ్స్ సమయాల్లో మరిన్ని రక్షణలను కావలని డిమాండ్

    • సుందర్ పిచాయ్ కార్యాలయంలో వర్కర్ యూనియన్ పిటిషన్

    • ఉద్యోగిని తొలగించాల్సి వస్తే మెరుగైన పరిహారం ఇవ్వాలని స్పష్టీకరణ

  • Jul 17, 2026 17:07 IST

    ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా తెలంగాణలో బార్ల వేళల పొడిగింపు

    • అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలకు అనుమతి

    • 18- 19 మధ్య తెల్లవారుజాము 4:30 గంటల వరకూ బార్లు తెరిచేందుకు అనుమతి

    • 19- 20 మధ్య తెల్లవారుజాము 3 గంటల వరకూ బార్లకు అనుమతి

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 16:44 IST

    మహిళల హాకీ ప్రపంచ కప్: భారత జట్టు ప్రకటన

    • ఆగస్టు 15 నుంచి 30 వరకు జరగనున్న హాకీ ప్రపంచ కప్ 2026

    • ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న నెదర్లాండ్స్, బెల్జియం

    • 20 మందితో కూడిన జట్టును ప్రకటించిన హాకీ ఇండియా

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 16:29 IST

    నంద్యాల: మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తా

    • కూలీలకు గాయాలు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 17, 2026 16:27 IST

    శరవేగంగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్‌ ప్రాజెక్ట్ పనులు

    • బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్-జపాన్ చర్చలు విజయవంతం

    • 2027 నాటికే ప్రయాణికులకు అందుబాటులోకి మొదటి సెక్షన్

    • స్వదేశీ హైస్పీడ్ రైళ్లతోనే ప్రాజెక్ట్ శ్రీకారం

    • ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించడమే లక్ష్యంగా ఇరుదేశాల నిర్ణయం

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 16:14 IST

    BRS యువ సంగ్రామ సభకు TG హైకోర్టు అనుమతి

    • రేపు సరూర్‌నగర్‌ స్టేడియంలో సభ

    • షరతులతో అనుమతిచ్చిన హైకోర్టు

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 16:12 IST

    కోస్తాంధ్రకు వర్ష సూచన

    • వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

    • ఒడిశా, జార్ఖండ్, బెంగాల్‌ పరిసరాల్లో అల్పపీడనం

    • కోస్తాంధ్రకు 5 రోజుల పాటు వర్ష సూచన

  • Jul 17, 2026 16:10 IST

    అమరావతి: కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

    • సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్‌ సభ్యులతో భేటీ

    • పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం

  • Jul 17, 2026 16:09 IST

    హైదరాబాద్: ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు EHS ఐడీ: సీఎస్ సంజయ్ జాజు

    • EHS కింద 1,816 ప్రొసీజర్లకు నగదు రహిత చికిత్సలు

    • EHS కింద 886 ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సలు

    • 24 వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు: సీఎస్ సంజయ్ జాజు

  • Jul 17, 2026 16:00 IST

    తెలంగాణ సచివాలయంలో EHSకు శ్రీకారం

    • కొత్త EHS పోర్టల్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

    • ఉద్యోగులకు హెల్త్‌ కార్డులను పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం

    • ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్‌ వైద్యసేవలు

    • తెలంగాణలో నూతన అధ్యాయం ప్రారంభం: మల్లు భట్టి విక్రమార్క

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 15:49 IST

    గుంటూరు: ఆధునికీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్ ప్రారంభం

    • మంగళగిరి రైల్వే స్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

    • ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్

    • అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మంగళగిరి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ

    పూర్తి కథనం..

  • Jul 17, 2026 15:17 IST

    తూర్పు గోదావరి: పెరవలి మండలం తీపర్రులో ప్రమాదం

    • రోడ్డు పక్కన నిలబడి ఉన్న మహిళను ఢీకొట్టిన ట్రాక్టర్

    • అక్కడికక్కడే మృతి చెందిన మహిళ

    • మృతురాలు తీపర్రు గ్రామానికి చెందిన వాటాల పద్మ (39)గా గుర్తింపు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 17, 2026 15:15 IST

    తిరుపతి: వడమాలపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

    • పూడి క్రాస్ వద్ద స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

    • సత్యవేడు నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు

    • మృతులు రామచంద్రపురానికి చెందిన నాగరాజు (65), చక్రవర్తి (60)గా గుర్తింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 17, 2026 15:12 IST

    రాజధానిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

    • టూరిజం ప్రాజెక్టులపై ADCL అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష

    • రోడ్లు, భవనాలు నిర్మాణం పూర్తయ్యేనాటికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆదేశాలు

  • Jul 17, 2026 15:00 IST

    నల్లగొండ : అనుముల మండల పరిధిలో దారుణం

    • బాలికపై కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు

    • బాలిక గర్భం దాల్చడంతో వెలుగులోకి వచ్చిన దారుణం

    • బాధిత బాలిక ఫిర్యాదుతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

    • బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

  • Jul 17, 2026 14:50 IST

    ఏపీ లిక్కర్ రవాణా కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ

    • సిగ్మా సంస్థకు కాంట్రాక్టు గడువును దీర్ఘకాలికంగా పొడిగించినట్లు గుర్తింపు

    • దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరిగినట్లు ఈడీ గుర్తింపు

    • ఈ సిగ్మా సంస్థల ఆర్థిక లావాదేవీలన్నీ రాజ్ కసిరెడ్డి, వాసు దేవరెడ్డి చేసినట్లు గుర్తింపు

    • దీని ద్వారా వైసీపీ నేతలు రూ.195.33 కోట్లు దోచుకున్నట్లు గుర్తింపు

  • Jul 17, 2026 14:45 IST

    నిరుద్యోగులను ముంచిన చరిత్ర BRSదే: మంత్రి సీతక్క

    • BRS పాలనలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదు: మంత్రి సీతక్క

    • త్వరలో మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

    • కోర్టు కేసులతోనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం: మంత్రి సీతక్క

  • Jul 17, 2026 14:40 IST

    భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    • 900 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్

    • 250 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ

  • Jul 17, 2026 14:30 IST

    చిత్తూరు జిల్లా వి.కోటలో దారుణం

    • ప్రియుడితో కలిసి కుమారుడిపై మహిళ దాడి

    • ఏకాంతంగా గడిపేందుకు అడ్డు వస్తున్నాడని బ్లేడుతో దాడి

    • కుమారుడు విశాల్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Jul 17, 2026 14:14 IST

    అమరావతి: టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి

    • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

  • Jul 17, 2026 14:04 IST

    ఆర్బీఐ కీలక నిర్ణయం

    • త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు

    • రూ.10, రూ.20 నోట్లతో తొలి ప్రయోగం

    • 2027 నుంచి దశలవారీగా అమలుకు అవకాశం

    • పేపర్ నోట్లతో పాటు పాలిమర్ నోట్ల చలామణి

    • మరింత మన్నికైన కరెన్సీపై ఆర్బీఐ దృష్టి

  • Jul 17, 2026 13:52 IST

    పల్నాడు: నరసరావుపేటలో రుణ మేళా కార్యక్రమం

    • పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

    • ప్రభుత్వ స్టాళ్లను సందర్శించిన చంద్రబాబు, నిర్మలా సీతారామన్

  • Jul 17, 2026 13:51 IST

    జైపూర్: గల్ఫ్‌ సంక్షోభాన్ని ఎన్డీయే సర్కార్ సమర్థవంతంగా ఎదుర్కొంది: ప్రధాని మోదీ

    • 2014 ముందు ఇలా జరిగితే.. రైల్వే వ్యవస్థ కుప్పకూలేది: మోదీ

    • 2014కు ముందు చాలా వరకు రైళ్లు డీజిల్‌పైనే నడిచేవి: మోదీ

  • Jul 17, 2026 13:50 IST

    ఢిల్లీ: 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై JPC తుది భేటీ

    • అపరాజితా సారంగి నేతృత్వంలో JPC సమావేశం

    • ఈనెల 20న పార్లమెంట్‌కు నివేదిక సమర్పించనున్న JPC

    • 30 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్ రాని ప్రజాప్రతినిధులు పదవులను కోల్పోయేలా బిల్లు తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

  • Jul 17, 2026 13:24 IST

    ఖుష్బూ కూతురు పెళ్లి ఫొటోలు వైరల్

    • ఒకే ఫ్రేమ్‌లో త్రిష, తమన్నా సందడి

    • త్రిష ఫొటో తీసిన తమన్నా

    • అవంతిక పెళ్లిలో సినీ తారల సందడి

  • Jul 17, 2026 13:18 IST

    హైదరాబాద్: కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లిస్తోంది: కేంద్రమంత్రి బండి సంజయ్

    • కేంద్ర నిధులను పంచాయతీ అకౌంట్లలోనే జమ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తా: బండి సంజయ్

    • అభివృద్ధికి నిధులిస్తే.. జీతాలకు, కరెంట్ బిల్లులకు కేటాయిస్తోంది: బండి సంజయ్

    • రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మార్చుకోవాలి: బండి సంజయ్

  • Jul 17, 2026 13:17 IST

    ఢిల్లీ: బెంగాల్ SIR వివాదంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ

    • కేంద్ర ఎన్నికల సంఘం, బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు

    • ఒకరి పౌరసత్వాన్ని EC నిర్ధారించలేదన్న సుప్రీంకోర్టు

    • పౌరసత్వాన్ని తేల్చే బాధ్యత కేంద్ర హోంశాఖదేనన్న సుప్రీంకోర్టు

  • Jul 17, 2026 13:16 IST

    అమరావతి: గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు గుడ్‌న్యూస్

    • పదోన్నతులకు సర్వీస్ రూల్స్ సడలింపు

    • 300 మందికిపైగా వార్డెన్లకు ప్రమోషన్ అవకాశం

    • 2008 నుంచి పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌కు పరిష్కారం

    • కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వార్డెన్లకు ఊరట

    • మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపిన వార్డెన్లు

  • Jul 17, 2026 12:53 IST

    కేదార్‌నాథ్ యాత్ర మార్గం తాత్కాలికంగా మూసివేత

    • కొండచరియలు విరిగిపడటంతో రహదారి మూసివేత

    • చౌడీ సమీపంలో దెబ్బతిన్న ట్రెక్కింగ్ మార్గం

    • యాత్రికులను నిలిపివేసిన వైఎంఎఫ్ బృందాలు

    • రుద్రప్రయాగ్‌లో భారీ వర్షాల ప్రభావం

    • కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు

  • Jul 17, 2026 12:46 IST

    అమరావతి: సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ

    • సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును పాత గుంటూరు హైవేకి అనుసంధానం

    • బకింగ్ హామ్ కెనాల్, కొండవీటి వాగులపై స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం

    • విజయవాడ, మంగళగిరి నుంచి అమరావతికి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం

    • స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యేలోపు పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు

  • Jul 17, 2026 12:38 IST

    భారత్‌కు అమెరికా సెనేట్‌ షాకింగ్‌ బిల్లు

    • రష్యా నుంచి ఆయిల్ కొంటే 100 శాతం పన్ను

    • అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన చరిత్రాత్మక రష్యా ఆంక్షల బిల్లు

    • బిల్లుకు 60 మందికి పైగా సెనేటర్ల మద్దతు

    • రష్యా చమురును కొనే భారత్, చైనాలతో సహా ఐదు దేశాలే టార్గెట్

  • Jul 17, 2026 12:26 IST

    ఎంపీలతో డీఎంకే అధినేత స్టాలిన్ సమావేశం

    • పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లుపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం

    • డీలిమిటేషన్ బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు: డీఎంకే

    • డీలిమిటేషన్ బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం: డీఎంకే

  • Jul 17, 2026 12:26 IST

    ఢిల్లీ: జులై 20న విపక్షాల అత్యవసర సమావేశం

    • కేంద్రానికి వ్యతిరేకంగా వ్యూహరచన చేయనున్న ఇండియా కూటమి

    • కేంద్రం తీసుకొచ్చే వివాదాస్పద బిల్లులను పార్లమెంట్‌లో గట్టిగా అడ్డుకుంటాం: కాంగ్రెస్ నేత జైరాం రమేష్

  • Jul 17, 2026 12:25 IST

    ఏపీ లిక్కర్ రవాణా కేసులో ఈడీ విచారణ

    • కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్‌ను వేర్వేరుగా విచారణ

    • భారీగా మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ గుర్తింపు

  • Jul 17, 2026 12:24 IST

    ఢిల్లీ: 20వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష

    • ఈనెల 20న కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీ

    • జులై 20 వరకు సజీవంగా ఉంటా: సోనమ్ వాంగ్‌చుక్

    • సాధ్యం కాకపోతే.. ఆత్మగా అయినా తిరిగొస్తా: వాంగ్‌చుక్

    • బలహీనంగా కనిపిస్తున్నా.. అంతర్గతంగా బలంగా ఉన్నా: వాంగ్‌చుక్

  • Jul 17, 2026 12:01 IST

    అంతరిక్షంలోకి మోదీ చేతిరాత పోస్టుకార్డు

    • విక్రమ్‌-1తో అంతరిక్షానికి మోదీ సందేశం

    • మిషన్‌ ఆగమనంలో ప్రత్యేక ఆకర్షణగా పోస్టుకార్డు

    • స్కైరూట్‌ ప్రయోగంలో మోదీ సందేశం

    • విక్రమ్‌-1లో అంతరిక్షానికి ప్రధాని లేఖ

    • ప్రైవేట్‌ స్పేస్‌ మిషన్‌లో చారిత్రక ఘట్టం

  • Jul 17, 2026 11:53 IST

    దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

    • హర్యానాలో రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

    • భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికత

    • హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య హైడ్రోజన్ రైలు

    • 10 కోచ్‌లతో హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

  • Jul 17, 2026 11:19 IST

    జపాన్ ఓపెన్ టోర్నీ: సెమీస్‌కు సింధు

    • టోక్యోలో క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన నొజోమీతో తలపడాల్సిన సింధు

    • గాయం కారణంగా ఆ మ్యాచ్‌కు నొజోమీ దూరం

    • దీంతో ఎలాంటి పోటీ లేకుండా సెమీస్‌లో అడుగుపెట్టిన సింధు

  • Jul 17, 2026 11:18 IST

    దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

    • 'జైష్-ఎ-మహమ్మద్' ఉగ్రముఠా అరెస్ట్

    • ఐదుగురిని అరెస్ట్ చేసిన గుజరాత్ ATS

    • దేశంలో పలుచోట్ల పేలుళ్లకు ప్లాన్

    • నిందితులను ప్రశ్నిస్తున్న అధికారులు

  • Jul 17, 2026 11:17 IST

    సైబరాబాద్ కమిషనరేట్‌లో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ

    • 55 మందిని బదిలీ చేస్తూ సీపీ రమేష్‌రెడ్డి ఉత్తర్వులు

  • Jul 17, 2026 11:17 IST

    ఎంపీ మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ దళిత నేతల భేటీ

    • తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ఏర్పాటుపై చర్చ

  • Jul 17, 2026 11:16 IST

    సిద్దిపేట: కొండపోచమ్మ ప్రాజెక్ట్ దగ్గర బీఆర్ఎస్ ధర్నా

    • మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నేతల నిరసన

  • Jul 17, 2026 10:09 IST

    ఏలూరు త్రీ టౌన్ పీఎస్ పరిధిలో బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి, బంధువులు

    • నగరంలో ఒక ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక

    • అదే స్కూల్ బయట కొబ్బరికాయలు అమ్ముకునే దండూరి చుక్కయ్య (62) లైంగిక దాడి చేసినట్లు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు

    • పోలీసుల అదుపులో నిందితుడు చుక్కయ్య

  • Jul 17, 2026 10:04 IST

    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో విషాదం..

    • స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు

    • రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం

    • పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

  • Jul 17, 2026 10:02 IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు

    • సీఎం ఫడణవీస్‌ను కలిసిన పార్థ్ పవార్

    • అంతకుముందు ఫడణవీస్‌తో ప్రఫుల్ పటేల్, తట్కరే భేటీ

    • ఎన్‌సీపీలో అంతర్గత విభేదాల ఊహాగానాలు

    • సునేత్ర పవార్ వివరణ కోరినట్లు సమాచారం

  • Jul 17, 2026 09:33 IST

    వరంగల్: నగరంలో భారీ వర్షం

    • గంట నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం

    • ఈ సీజన్‌లో తొలిసారిగా భారీ వర్షం

    • పంటలకు ఊపిరందుతుందని రైతుల హర్షం

  • Jul 17, 2026 09:25 IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు చైనా కౌంటర్

    • US ఎన్నికల్లో మా జోక్యం లేదు.. ఉండబోదు: చైనా

  • Jul 17, 2026 09:23 IST

    హైదరాబాద్: దేవాదాయశాఖలో ఖాళీల భర్తీకి మరో కీలక అడుగు

    • దేవాదాయశాఖలో 191 ఉద్యోగాలకు నేడు నియామకపత్రాలు

    • ఉ.11గంటలకు రవీంద్ర భారతిలో కార్యక్రమం

    • నియామకపత్రాలు పంపిణీ చేయనున్న మంత్రి కొండా సురేఖ

    • 47 ఆలయాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు

  • Jul 17, 2026 09:15 IST

    వరంగల్: ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలో హైటెన్షన్‌

    • బొల్లికుంట చౌరస్తాలో అర్ధరాత్రి శివాజీ విగ్రహం ఏర్పాటు

    • గతంలో అంబేద్కర్‌ విగ్రహం ఉన్నచోట శివాజీ విగ్రహం ఏర్పాటు

    • దళిత సంఘాల ఆందోళన

    • భారీగా మోహరించిన పోలీసులు

  • Jul 17, 2026 09:08 IST

    హైదరాబాద్‌: కులసుంపుర పీఎస్‌ పరిధిలో దారుణం

    • బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన అబ్దుల్ అజీజ్

    • అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్

    • అబ్దుల్‌ అజీజ్‌పై తల్లిదండ్రుల దాడి

    • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అబ్దుల్ అజీజ్ మృతి

  • Jul 17, 2026 09:08 IST

    హైదరాబాద్‌: శంకర్‌పల్లిలో విషాదం

    • ఇద్దరు పిల్లలను బావిలో తోసి తల్లి ఆత్మహత్య

    • తల్లి వసంత, కుమార్తె నవ్య మృతి

    • ప్రాణాలతో బయటపడ్డ పదేళ్ల కుమారుడు

  • Jul 17, 2026 09:05 IST

    కడప జిల్లాలో కరోనా కలకలం

    • రిమ్స్‌తో పాటు ఆయా ఆస్పత్రుల్లో అప్రమత్తం

    • ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు చర్యలు

    • జులై 7 వరకు 8 కోవిడ్ కేసులు నమోదు

    • కరోనాతో ఇద్దరి మృతి

    • ఆ తర్వాత ఎలాంటి కేసులు లేవంటున్న వైద్యాధికారులు

  • Jul 17, 2026 08:55 IST

    సక్సెస్ స్కూల్ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

    • ఘటనపై వివరణ కోరిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

    • మత బోధనలపై సుమోటోగా విచారణ

    • మానవ హక్కుల ఉల్లంఘనగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యాఖ్య

    • హైదరాబాద్ కలెక్టర్, సీపీకి నోటీసులు

    • జిల్లా విద్యాశాఖ అధికారికీ నోటీసులు

    • 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

  • Jul 17, 2026 08:30 IST

    కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి బొట్లవానిపాలెంలో దారుణం

    • తల్లి, కుమారుడి మధ్య ఘర్షణ

    • క్షణికావేశంలో కుమారుడిని కర్రతో కొట్టిన తండ్రి రామ్మోహన్‌రావు

    • తీవ్రగాయాలతో కుమారుడు కళ్యాణ చక్రవర్తి(30) మృతి

    • కేసు నమోదు చేసిన పోలీసులు

  • Jul 17, 2026 08:01 IST

    కృష్ణా: నేడు రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభం

    • వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    • రూ.35 కోట్లతో స్టేషన్ అభివృద్ధి

    • ‘అమృత్ భారత్’ పథకం కింద నిర్మాణం

    • విజయవాడకు ప్రత్యామ్నాయ స్టేషన్

    • అందుబాటులోకి ప్రపంచస్థాయి సౌకర్యాలు

  • Jul 17, 2026 07:49 IST

    బ్రిడ్జీలే లక్ష్యంగా ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు

    • బండార్‌ ఈ ఖామీర్‌ బ్రిడ్జిపై వైమానిక దాడి

    • ఏడుగురి మృతి, 10 మందికి గాయాలు

    • బండార్ అబ్బాస్‌ పోర్ట్ సిటీపైనా దాడులు

  • Jul 17, 2026 06:59 IST

    విశాఖ: అఫీషియల్ కాలనీలో కరోనా కలకలం

    • 33 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్

    • హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యుల సూచన

    • అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

  • Jul 17, 2026 06:58 IST

    నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

    • హరియాణా, చండీగఢ్‌, పంజాబ్‌లో పర్యటించనున్న మోదీ

    • రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం

    • పీజీఐఎంఈఆర్‌లో కొత్త కేంద్రాల ప్రారంభం

  • Jul 17, 2026 06:46 IST

    నేడు తెలంగాణ ఎస్సీ ప్రజాప్రతినిధుల సమావేశం

    • ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం

    • తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ఏర్పాటుపై చర్చ

  • Jul 17, 2026 06:44 IST

    నరసరావుపేటలో నేడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు పర్యటన

    • క్రెడిట్‌ ఔట్‌ రీచ్‌ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం చంద్రబాబు

    • 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు

  • Jul 17, 2026 06:43 IST

    తిరుపతి: హైదరాబాద్ యువకుడిపై చీటింగ్ కేసు

    • రూ.11 లక్షలు తీసుకుని తిరిగివ్వలేదని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కొర్లగుంట యువతి ఫిర్యాదు

    • హైదరాబాద్‌కు చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం

    • తన తల్లికి బాగోలేదని నగదు తీసుకున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్న యువతి

  • Jul 17, 2026 06:35 IST

    హైదరాబాద్: నేడు నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం

    • సచివాలయంలో మధ్యాహ్నం 1 గంటకు EHS ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • కొత్త EHS పోర్టల్, హెల్త్‌కార్డుల పంపిణీని ప్రారంభించనున్న భట్టి విక్రమార్క

  • Jul 17, 2026 06:32 IST

    నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

    • కేబినెట్‌ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతల నేటి జూమ్‌ మీటింగ్‌ వాయిదా

    • ఈ నెల 19న కాంగ్రెస్‌ నేతల జూమ్‌ సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌, మీనాక్షి, మహేశ్ గౌడ్‌, ఎమ్మెల్యేలు

    • SIR పనితీరుపై చర్చించనున్న కాంగ్రెస్‌ నేతలు

  • Jul 17, 2026 06:30 IST

    తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు ఆణివార ఆస్థానం

    • పలు ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ

    • నేడు సాయంత్రం పుష్ప పల్లకిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి