Share News

భారతీయుల వల్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యం: జపాన్ మాజీ మంత్రి

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:48 PM

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు జాప్యానికి ఒక భారత మంత్రి, ఇతర అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా ఆరోపించారు.

భారతీయుల వల్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యం: జపాన్ మాజీ మంత్రి
Mumbai Ahmedabad Bullet Train

ఇంటర్నెట్ డెస్క్: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు జాప్యానికి ఒక భారత మంత్రి, ఇతర అధికారులు కారణమని జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై ఒక జపాన్ ఇంజినీర్ స్థానిక వార్తాపత్రికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మంత్రి సోషల్ మీడియాలో స్పందించారు.

ఈ ప్రాజెక్టు 2023లోనే ప్రారంభించడం అసాధ్యమని భారతీయ అధికారులకూ తెలుసునని ఆ ఇంజినీర్ పేపర్‌లో రాసుకొచ్చారు. మొదట ప్రతిపాదించిన అంశాలతో పోలిస్తే ప్రాజెక్టు ప్రస్తుతం కొంత భిన్నంగా ఉందని అన్నారు. షిన్‌కాన్సెన్ సాంకేతికత ఆధారంగా ఈ ప్రాజెెక్టును ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

ఈ కథనంపై మంత్రి హిడెకీ స్పందిస్తూ భారత అధికారులు చర్చల సందర్భంగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకుండా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.


జపాన్ ప్రధాని భారత పర్యటన తరువాత కూడా ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు. బుల్లెట్ ట్రెయిన్ భద్రతకు కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్థ జపాన్‌కు దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. షిన్‌కాన్సెన్ సాంకేతికత పూర్తిస్థాయిలో బుల్లెట్ రైలు కోసం వినియోగించకపోవడంపై జపాన్‌లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, రైలు నెట్వర్క్ నిర్వహణ‌కు పూర్తిగా జపాన్‌పై ఆధారపడకుండా కొన్ని ఐరోపా వ్యవస్థలను కూడా భారత్ ఎంచుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయితే, ఈ ప్రాజెక్టు విషయంలో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశ వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి దశలో భారత్‌లో తయారైన హైస్పీడ్ రైళ్లతో కార్యకలాపాలు మొదలెట్టేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్టు సమాచారం. 2030 నాటికల్లా ఈ10 బుల్లెట్ రైళ్లను సమకూర్చేందుకు జపాన్ అంగీకరించినట్టు తెలిసింది.


ఈ వార్తలనూ చదవండి:

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్!

భూరికార్డులు పౌరసత్వానికి రుజువులు కావు: కలకత్తా హైకోర్టు

Updated Date - Jul 17 , 2026 | 07:21 PM