Share News

అంగన్‌వాడీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:39 PM

ఏపీలో అంగన్‌వాడీలకు తల్లికి వందనం పథకం వర్తింప చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

అమరావతి, జులై 17: అంగన్‌వాడీ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపు చేస్తున్నట్లు వెల్లడించారు. టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన వివరించారు.


అంగన్‌వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి సంధ్యారాణి

అంగన్‌వాడీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల చిరకాల కోరిక నెరవేరిందని అన్నారు. అర్బన్, రూరల్ అంగన్‌‌‌వాడీ సిబ్బంది అందరికీ ఈ పథకం అమలు అవుతుందని తెలిపారు. అంగన్‌వాడీ సిబ్బందికి మరింత భరోసా కల్పించే నిర్ణయం ఇదని చెప్పారు.


అంగన్‌వాడీల సంక్షేమానికి సీఎం ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తారని ఆమె గుర్తు చేశారు. జీతాల పెంపు, గ్రాట్యుటీ తర్వాత 'తల్లికి వందనం' వరం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. అంగన్‌వాడీల కుటుంబాల తరఫున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


తమను తల్లికి వందనం పథకం పరిధిలోకి తీసుకురావాలంటూ అంగన్‌వాడీలు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ

ఇతడి టాలెంట్ ముందు కంప్యూటర్ కూడా దిగదుడుపే.. వీడియో వైరల్..

For More AP News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 06:29 PM