సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:12 PM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.
అమరావతి, జులై 17: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు చర్చించాల్సిన అంశాలపై వారు చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 13వ తేదీతో ముగుస్తాయి. ఈ అంశాలపై వారు చర్చిస్తున్నారు. ఆ వివరాలు..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలు.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పెట్టుబడుల ఆకర్షణ.
రాయలసీమకు సాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన గోదావరి - పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ, కార్యాచరణ.
విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, రైల్వే భూముల కేటాయింపు, జోన్ పూర్తిస్థాయి కార్యకలాపాల ప్రారంభం.
రాష్ట్రంలో నూతన పెట్రోలియం రిఫైనరీల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, భారీ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన అంశాలు.
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారం, ఫేక్ న్యూస్ కట్టడి, వ్యవస్థలపై జరుగుతున్న దాడుల అంశాన్ని పార్లమెంట్ వేదికగా లేవనెత్తడం.
పార్లమెంట్ సభ్యులు లేవనెత్తిన తమ నియోజకవర్గాల సమస్యలు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు.
పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టే వివిధ చట్ట సవరణలు, కొత్త బిల్లుల పట్ల పార్టీ అనుసరించాల్సిన విధానం.
నియోజక వర్గాల పునర్విభజన, మహిళా బిల్లు, SIR, అయోధ్య విరాళాలతో పాటు సభలో చర్చించాల్సిన ఇతర అత్యవసర ప్రజా సమస్యలు, సమకాలీన అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అంగన్‌వాడీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఇతడి టాలెంట్ ముందు కంప్యూటర్ కూడా దిగదుడుపే.. వీడియో వైరల్..
For More AP News And Telugu News