ఇతడి టాలెంట్ ముందు కంప్యూటర్ కూడా దిగదుడుపే.. వీడియో వైరల్..
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:04 PM
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అయితే అది సందర్భానుసారం బయటికి వస్తుటుంది. కొందరిలో ఎంత టాలెంట్ ఉన్నా.. అలాగే మరుగున పడి ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి టాలెంట్ బయటికి వస్తోంది. తాజాగా, ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అయితే అది సందర్భానుసారం బయటికి వస్తుటుంది. కొందరిలో ఎంత టాలెంట్ ఉన్నా.. అలాగే మరుగున పడి ఉంటుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి టాలెంట్ బయటికి వస్తోంది. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కాలిక్యులేటర్‌ను వాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు.
యాలకలు, లవంగాలు విక్రయించే వ్యక్తి.. ఆ పక్కనే కాగితంపై ఉన్న వాటి ధరల వివరాలను చూస్తూ క్యాలిక్కులేటర్‌లో అత్యంత వేగంతా లెక్కలు వేస్తున్నాడు. అది ఎంత వేగం అంటే.. కళ్లు మూసి తెరిచే లోగానే వాటి లెక్కలన్నీ అందులో కూడిక చేసేశాడు. క్యాలిక్కులేటర్ వైపు చూడకుండానే.. అంకెలను ఎంతో వేగంగా నొక్కుతూ.. కూడిక చేసేశాడు. చివరగా పరిశీలిస్తే.. కాగితంలో సంఖ్యలను కూడగా వచ్చిన మొత్తం.. కాలిక్యులేటర్‌లో వచ్చిన మొత్తం ఖచ్చితంగా ఉంది.
కాలిక్యులేటర్‌పై లెక్కలు చేయడం సర్వసాధారణం. అయితే ఎవరైనా చాలా జాగ్రత్తగా వాటిపై అంకెలు చూస్తూ లెక్కలు వేస్తారు. కానీ ఈ వీడియోలోని వ్యక్తి కాలిక్యులేటర్ చూడకుండానే వాయు వేగంతో లెక్కలు వేస్తున్నాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇతడి ప్రతిభను చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇది ఏ ప్రాంతంలో జరిగిందనే దానిపై సమాచారం లేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.