Share News

మంగళగిరి రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన పీఎం మోదీ.. పాల్గొన్న మంత్రి లోకేశ్

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:32 PM

ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

మంగళగిరి రైల్వేస్టేషన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన పీఎం మోదీ.. పాల్గొన్న మంత్రి లోకేశ్
Minister Nara Lokesh

గుంటూరు జిల్లా, జులై 17: ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. అమృత్‌ భారత్ స్టేషన్‌ పథకం కింద మంగళగిరి రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో వేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయన్నారు. ఏపీని నంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.


ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని మంత్రి వెల్లడించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదన్నారు. పారిశ్రామికవేత్తలు పారిపోయేలా వైసీపీ పాలన సాగిందని విమర్శలు గుప్పించారు. కూటమి పాలనలో ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలకు పరిశ్రమలను తీసుకొస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజంపై ప్రభుత్వం ఫోకస్

ఏపీలో ఎల్‌నినో ప్రభావంపై సీఎస్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2026 | 05:09 PM